నిత్యావసరాల పేరుతో నిత్యం రోడ్ల పైనే
పోలీసు చలానాలు సైతం లెక్కచేయక రోడ్ల పై వాహనాలతో రయ్..రయ్
- లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్న నగర ప్రజలు
- ఉదయం నుంచి రోడ్ల పై విచ్చలవిడిగా..
- 1,40,000 కేసులు నమోదు చేసిన పోలీసులు
- పాతబస్తీలో పగలు, రాత్రి కూడా రోడ్ల పైనే ప్రజలు
- అదనపు పోలీసు బలగాలు లేక అవస్థలు
- స్వచ్ఛందంగా ఇంటివద్దనే ఉంటున్నవారి సంఖ్య 60 శాతం
- హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ కరోనా కేసుల నమోదు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా వాహనదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వాహనదారులకు పోలీసులు చలానాలు విధిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఒక్క హైదరాబాద్‌లోనే 1,45,000 మంది నిబంధనలు ఉల్లంఘించారు. వారికి పోలీసులు జరిమానాలు విధించారు. మరికొంత మంది వాహనాలు సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నవాళ్లకు మాత్రమే ఇచ్చిన మినహాయింపును తప్పుదోవ పట్టిస్తూ.. రోడ్డు పైకి వచ్చినవారిని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేస్తున్నారు. ద్విచక్రవాహనం పై ఇద్దరు ప్రయాణించకూడదన్న నిబంధనను తుంగలో తొక్కిన వారికి కూడా పోలీసులు భారీగా చలానాలు విధిస్తున్నారు. అంతటా రెండు వారాలుగా లాక్ డౌన్ అమలవుతున్నా పాతనగరంలో మాత్రం ఆ ఛాయలు పెద్దగా కానరావడం లేదు. ‘సామాజిక దూరం పాటించాలి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్న’ అధికారులు, పోలీసుల సూచనలను పలువురు పెడచెవిన పెడుతున్నారు. స్థానికంగా కొన్ని రేషన్ దుకాణాల్లో సిగరెట్లు విక్రయిస్తుండటంతో య ఎవకులు వాటి కొనుగోలుకు ద్విచక్రవాహనాల పై వస్తున్నారు. దాదాపు 70 శాతం మంది లాక్ డౌనను సాధారణ రోజుల్లానే భావిస్తున్నారు. మదీనా, గుల్జార్ హౌస్, శాలిబండ, చార్మినార్, మీరాలం మండి, డబీర్‌పుర, మీర్ చౌక్, నయాపూల్, దారుల్ షిఫా ప్రాంతాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా ఒక్కో వాహనం పై ఇద్దరు, ముగ్గురు బయటకు వస్తున్నారు. గస్తీ పోలీసులున్నప్పుడు గల్లీల్లో ఉంటూ.. వారు వెళ్లగానే యథావిధిగా యువత రాకపోకలు కొనసాగిస్తున్నారు. మీరాలం మండి కూరగాయల మార్కెట్ లోకి ద్విచక్రవాహనాలు తీసుకురాకూడదని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. బారికేడ్లను తొలగించి పైవంతెనల పై రాకపోకలు కొనసాగిస్తుండటం గమనార్హం. దేశమంతా లాక్ డౌన్ ఉన్నా మందుబాబులు మాత్రం పెగ్ డౌన్ చేయట్లేదు. వైన్స్ షాపులు బంద్ చేసినప్పటికీ ఉమ్మడి మెదక్, మహబూబ్ ?నగర్?, నల్గొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లాక్ డౌన్ ను ఏమాత్రం పట్టించుకోని వైన్స్ ఓనర్లు సరుకును బ్యాక్ డోర్ నుంచి బెల్ట్ షాప్ లకు చేరవేస్తున్నారు. కొందరైతే ఆబ్కారీ ఆఫీసర్లు షాప్ లకు సీల్ వేయకముందే పెద్ద మొత్తంలో మద్యం నిల్వలను సీక్రెట్ ప్లేస్ లో దాచి పెట్టారు. ప్రస్తుతం మందుకు ఫుల్ డిమాండ్ ఉండడంతో డబుల్, ట్రిపుల్ రేట్లకు అమ్మకుంటున్నారు. కొన్ని చోట్ల ఏకంగా డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. కల్లు కంపౌండ్లు బంద్ పెట్టడంతో తండాల్లో మళ్లీ సారా బట్టీలు పెడుతున్నారు. గత పదిరోజుల్లోనే ఎక్సైజ్ అధికారుల దాడుల్లో లక్షల రూపాయల మందు, గుడుంబా పట్టుబడ్డది. మద్యం డబుల్, ట్రిపుల్ రేట్లు మద్యం బాటిళ్లను బెల్ట్ షాపు నిర్వాహకులు డబుల్, ట్రిపుల్ రేట్లకు అమ్ముతున్నా మందు బాబులు కొంటున్నారు. రూ.120 ఉన్న బీర్లను రూ. 300, రూ.700 ఉన్న విస్కీ ఫుల్ బాటిల్ రూ.1,800 నుంచి రూ. 2,000కు అమ్ముతున్నారు. పెద్ద బ్రాండ్లు అయితే రూ.3000 వరకు పలుకుతున్నాయి. రూ. 100 ఉండే చీఫ్ లిక్కర్‌ను సైతం రూ.250కు అమ్ముతున్నారు. ఒక్కో వ్యాపారి వద్ద సుమారు రూ.20 లక్షల మద్యం నిల్వలున్నట్లు తెలుస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలో బ్లాక్ మార్కెట్ లో సుమారు రూ.6 కోట్లకు పైగా మద్యం నిల్వ చేసినట్లు సమాచారం. సీల్ వేసినా.. బ్యాక్ డోరు నుంచి… ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగానే ఎక్సైజ్ ఆఫీసర్లు వైన్లను సీజ్ చేసి సీల్ వేశారు. వీళ్లు ముందు భాగంలోని షెటర్లకు సీల్ వేస్తే వ్యాపారులు బ్యాక్ డోర్ నుంచి వని మొదలు పెట్టారు. రాత్రి సమయంలో కాటన్ల కొద్దీ మద్యాన్ని సీక్రెట్ ప్లేసులకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే సీల్ తొలగించి.. మళ్లీ సీల్ వేస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ లో ఓ వైన్స్ షాప్ సీల్ ఓపెన్ చేసి మద్యాన్ని తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సదరు వైన్స్ షాప్?కు అధికారులు మళ్లీ సీల్ వేయడం గమనార్హం. సిద్దిపేట జిల్లాలో కొందరు బ్రోకర్లను పెట్టుకుని చైన్ సిస్టమ్ లో అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల డోర్ డెలివరీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో జోరుగా… ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన సూర్యాపేట పట్టణం, కోదాడ, హుజూర్నగర్, అలంపూర్ నియోజకవర్గాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నారాయణ పేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన మక్తల్?, మాగనూర్?, ఊట్కూర్?, కృష్ణా, నారాయణ పేట, దామరగిద్ద మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కర్నాటక నుండి మద్యాన్ని తీసుకు వచ్చి ఇక్కడి బెల్టుషాపులలో విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాకౌట్ నిబంధనలను నగర ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. పదో రోజు బుధవారం నగరంలోని ప్రజలు విచ్చలవిడిగా రోడ్ల పైకి వచ్చారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలనే సాకుతో బయటికి వచ్చి తిరుగుతున్నారు. పోలీసులు భద్రత కోసం రోడ్ల పై ఉన్నా కూడా వాహనాల పై తిరుగుతున్నారు. నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే బైక్ పై ఒకరు, కారులో ఇద్దరు బయటికి రావచ్చని పోలీసులు నిబంధనలు విధించారు. అయితే వాటిని పలువురు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గుంపులు, గుంపులుగా రోడ్ల పైకి వస్తున్నారు, అవసరం ఉన్నా లేకున్నా బయటికి వస్తున్నారు. ఇప్పటి వరకు అవసరం లేకున్నా బయటికి వచ్చిన వారిపై పోలీసులు 1,40,000 కేసులు నమోదు చేశారు. ఆయా వాహనాల యజమానులపై కేసులు నమోదు చేశారు. భారీగా జరిమానా విధించారు. సిసి కెమెరాల సాయంతో నగరంలో అవసరం లేకున్నా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతున్న వారిని గుర్తించి చలాన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకే వాహనాల యజమానులకు సమాచారం చేరవేశారు. ఇలాంటి కేసులు నగరంలో రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు ఎంత నిర్బంధంగా లాక్ డౌనను అమలు చేయాలని చూస్తున్నా నగర ప్రజలు మాత్రం అర్ధం చేసుకోవడం లేదు. వాటిని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. ట్రాఫిక్ జాం మామూలే లాక్ డౌన్ వల్ల జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఉండదనికున్నా అది ఎక్కడా కనిపించడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు వాహనదారులు పట్టించుకోకపోవడంతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేయాల్సి వస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పనిలేకున్నా రోడ్ల పైకి వచ్చిన వారికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎవరూ బయటికి రావద్దని కోరుతున్నారు.