కరోనా నిర్ధారణ పరీక్షలు?
వైరస్ వ్యాప్తి కట్టడికి దేశ రాజధానిలో ముమ్మర చర్యలు
- 4421కి చేరిన భారత కరోనా కేసుల సంఖ్య
- 24 గంటల్లో కొత్తగా 354 పాజిటివ్ కేసులు
- దేశంలో మొత్తం మరణాల సంఖ్య 114
- వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వైద్య పరీక్షలు
- ఢిల్లీలో 7కు చేరిన మృతుల సంఖ్య -ధారవికి పాకిన కరోనా వైరస్
- లాక్ డౌన్ పొడిగించాలని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు
- లాక్ డౌన్ ఎత్తివేత పై పునరాలోచనలో కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ముఖ్యంగా దిల్లీ నిజాముద్దీన్ ఘటన అనంతరం అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాబోయే రోజుల్లో దేశ రాజధాని దిల్లీలో ఈ వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన దిల్లీ ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా దిల్లీలో దాదాపు లక్షమందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా కరోనా కేసులు అధికంగా నిర్ధారణ అవుతున్న ప్రాంతాల్లో సాధారణ ప్రజలకూ ఈ పరీక్షలు చేయనుంది. లక్షణాలు బయటపడకముందే ఈ వైరస్ మరికొందరికి వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కరోనా వైరస్ ను గుర్తించడంలో నిర్ధారణ పరీక్షలు ఎంతో కీలకం. కేవలం లక్షణాలు ఉన్నవారికే కాకుండా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారీసంఖ్యలో సాధారణ ప్రజలకు పరీక్షలు చేయడం ద్వారా వైరస్ తీవ్రత ఏవిధంగా ఉందో గుర్తించే వీలుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే దిల్లీలో 523మంది కరోనా బారినపడగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకి 114 మరణించగా 4421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 114మంది మరణించగా 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 326 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 354 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వచ్చే వారంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 748కి చేరింది. గుజరాత్ లో కొవిడ్-19 మృతుల సంఖ్య 12కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 144గా ఉంది. మధ్యప్రదేశ్ లో వైరస్ తీవ్రత మరింత పెరిగింది. మరణాల సంఖ్య తొమ్మిదికి చేరగా 165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాజాగా ఇండోర్‌లో మరో నాలుగు మరణాలు సంభవించినట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో కొవిడ్తో మరణించినవారి సంఖ్య 13కు చేరిందని ఎంజీఎం మెడికల్ కాలేజీ ప్రకటించింది. అయితే దీన్ని కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీలో కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. కరోనా కారణంగా ఇక్కడ మొత్తం ఏడుగురు మృతిచెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 523కు చేరింది. పంజాబ్ లో 76 కేసులు నమోదుకాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు మరణించగా 621మందికి కరోనా సోకింది. మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. కర్ణాటకలో కొవిడ్-19 మహమ్మారి సోకి నలుగురు మరణించారు. పశ్చిమబెంగాల్ లో కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. కేరళలో కొవిడ్ 19 కేసుల సంఖ్య 327కు చేరగా ఇద్దరు మరణించారు. జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్ 19 కారణంగా ఇద్దరు మరణించారు. ఈ త్తర్ ప్రదేశ్ లో 305 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ లలో ఒకరు చొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు నిర్ధారణ కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరింది. వీరిలో కొందరు కోలుకోగా ప్రస్తుతం 308మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్ కారణంగా 11మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కి చేరింది. వీరిలో ముగ్గురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా కర్నూలులో 74మందికి కరోనా సోకింది. లాక్ డౌన్ పొడిగించాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతలు అందుతున్నాయి. దీనిపై కేంద్రం సమాలోచనలు జరుపుతున్నది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌనను ప్రకటించిన విషయం తెలిసింది. ఇది ఈ నెల 14తో ముగుస్తున్నది. అయితే కొన్ని రాష్ట్రాలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటంతో.. లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితులు మరింత ఆందోళనకరంగా తయారవుతాయని ఆయా ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారు. దేశంలో సోమవారం నాటికి 4281 కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అసోం, ఛత్తీస్ గఢ్, జార్కండ్, తెలంగాణలో నమోదైన కేసులు 1367 ఉన్నాయి. అంటే మొత్తం కేసుల్లో ఇది మూడోవంతు. దీంతో ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌనను కొనసాగించడానికే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం పై లాక్ డౌనను మరికొంత కాలం పొడిగించాలన్న సూచనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు నిపుణులు ఏప్రిల్ 14 అనంతరం కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోందని ఉ న్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ పై సంప్రదింపులు జరుగుతున్నాయని, అయితే ఇంతవరకూ తుదినిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మ రోవైపు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో లాక్ డౌనను దశల వారీగా విరమించేందుకు ప్రణాళికతో ముందుకురావాలని మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ పొడిగింపు పై దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పకొచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్ డౌన్ ను కొనసాగించక తప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారి నుంచి మనం ప్రజల్ని రక్షించుకోవాలని, ఆర్థిక వ్యవస్థను తర్వాత చక్కదిద్దుకోవచ్చని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక రాజస్థాన్ సీఎం అశోక్ గెహెwత్ సైతం లాక్ డౌనను తక్షణమే ఉపసంహరించరాదని, దశలవారీగా లాక్ డౌనను ఎత్తివేయాలని అన్నారు. దేశవ్యాప్త లాక్ డౌన్ పై శాస్త్రీయ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని అసోం ప్రభుత్వం వెల్లడించింది. యూపీ సైతం లాక్ డౌనను మరికొంత కాలం కొనసాగించాలని కోరుతోంది. ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి మిగిలిపోయినా లా డౌనను సడలించడం కుదరదని, కరోనా రహిత రాష్ట్రంగా బయటపడేవరకూ కొనసాగించాలని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్ అవస్థి తేల్చిచెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 24న మూడు వారాల లా డౌనను ప్రకటించిన సంగతి తెలిసిందే.