మతాన్ని వేలెత్తి చూపడం సరికాదు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త అనిరుధ్ రెడ్డి తన సొంత ఖర్చుతో ప్రజలకు శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శానిటైజర్లు తీసుకెళ్తున్న వాహనాలను గాంధీభవన్ వద్ద ఉత్తమ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిలో కొందరు మతాన్ని వేలెత్తి చూపుతున్నారని.. అది సరైంది కాదని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 13 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 22 లక్షల టన్నుల బియ్యం మాత్రమే పేదలకు పంపిణీ జరిగిందని విమర్శించారు. కరోనా వైరస్, లా డౌన్ నేపథ్యంలో రేషన్ దారులకు రూ.1500 ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ ఆమొత్తం ఎవరికీ అందలేదన్నారు. కేంద్రం నుంచి ఇస్తామన్న బియ్యం కూడా ఇంకా తెలంగాణకు రాలేదని ఉత్తమ్ ఆక్షేపించారు. ఎంపీల వేతనాలలో 30 శాతం కోత కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉ ద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్ కు కేబినెట్ లో ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో ఏడాది పాటు కోత ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్చందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారని వివరించారు. ఈ మొత్తం సంఘటిత నిధికి వెళుతుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కోత వర్తిస్తుందని పేర్కొన్నారు. . అలాగే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జావడేకర్ తెలిపారు. రెండేళ్ల పాటు అమల్లోఉ ంటుందని తెలిపారు. ఈ మొత్తం కూడా సంఘటిత నిధికి వెళుతుందన్నారు. లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజలు, దేశం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.