ఏపీలో మరో 14 కొత్త కేసులు

266కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య..మూడుకు చేరిన మృతుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 నుంచి సోమవారం ఈ ఉదయం 9 వరకూ కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది. తాజాగా విశాఖ జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకూ కొవిడ్ నుంచి కోలుకొని ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మూడుకు చేరిన మృతుల సంఖ్య కరోనా వైరస్ తో బాధపడుతూ రాష్ట్రంలో కొత్తగా ఈరోజు ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి, మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3కి చేరింది. ఒకపూట భోజనం మానేయండి కరోనా పోరాట స్ఫూర్తిలో భాగంగా కార్యకర్తలకు సూచించిన ప్రధాని మోదీ