కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా పేద, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ పై జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాలకు జనవరి 30న సూచించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వైద్యం అందిస్తున్న డాక్టర్టకు కరోనా పాజిటివ్ కేసుకు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి మాస్క్ లు, డ్రెస్ కోడ్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ తో పాటు ప్రధాన పట్టణాలో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు జరపాలని కోర్టకు విన్నవించారు. లాక్ డౌన్ నేపథ్యంలో 1897 యాక్ట్ ప్రకారం ఇంటికే వస్తువులు సరఫరా చేయాలని, పేద ప్రజలు, అసంఘటిత కార్మికులకు, పిల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ఉ చితంగా వారికి భోజనం కల్పించాలి పిటిషనర్ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే పిటిషనర్ లేవనెత్తిన అంశాల పై ఏప్రిల్ 9న మధ్యంతర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేశారు. తుది నివేదిక ఏప్రిల్ 15 వరకు సమర్పించాలని ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ విచారించారు.