60 శాతం వృద్దులే

63% కరోనా మరణాలు వారివే: లవ్ అగర్వాల్

దిల్లీ: కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 30 మంది చనిపోయినట్లు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇందులో 1445 కేసులు తల్లిగీ జమాత్ కు సంబంధించినవేనని వివరించారు. ఇతర శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 24 గంటల్లో 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యని లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో 63 శాతం మరణాలు 60 ఏళ్లు పైబడిన వారివేనని తెలిపారు. 40-60 మధ్య వయసు గల వారు 30శాతం మ రణించగా.. 40 ఏళ్లలోపు మరణించిన వారి సంఖ్య 7 శాతంగా ఉందని తెలిపారు. మృతి చెందిన వారిలో 73 శాతం మంది పురుషులు కాగా.. 27 శాతం స్త్రీలు ఉ న్నారని వివరించారు. మరణించిన వారిలో 86 శాతం మంది డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారేనని పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించిన గత 13 రోజుల్లో మొత్తం మొత్తంగా 16.94 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా అయినట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మె ఎత్తం రూ.1100 కోట్లు ఆయా రాష్ట్రాలకు నిధులు విడుదల ఇప్పటికే విడుదల చేశామన్నారు. అదనంగా మరో రూ.3వేల కోట్లు సైతం ఇవాళ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 5 గ్రామాలు సీల్ ఇప్పటి వరకు 25వేలమంది తల్లిగీ జమాత్ కార్యకర్తలు, వారు కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ చేశామని హోంశాఖ అధికారులు తెలిపారు. తల్లిగీలు సంచరించిన హరియాణాలోని 5 గ్రామాలను సీల్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం 5 లక్షల టెస్టింగ్ కిట్ల కోసం ఆర్డర్ చేశామని, అందులో సగం కిట్లు 8, 9 తేదీల్లో వస్తాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వర్గాలు వెల్లడించాయి. మె ఎత్తం 136 ప్రభుత్వ లేబొరేటరీలు, 56 ప్రైవేటు లేబొరేటరీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, రోజుకు 18 వేల టెస్టులు చేయగల సామర్థ్యం ఈ ల్యాబ్ లకు ఉ 0దని తెలిపాయి.