వైద్య, పోలీస్ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణలో వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్య, పోలీస్ శాఖలు అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా సేవలందిస్తున్నందున వారికి పూర్తి వేతనాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల కోతపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వేతనాల కోత నుంచి వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖలకు మినహాయింపునిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం మే రకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.