3 రోజు శిశువుకు కరోనా
ముంబైలో డాక్టర్లు చేసిన పొరపాటుకు మూల్యం
ముంబై: కరోనా వైరస్ విజ ృంభిస్తున్న వేళ ముంబైలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ, తన నవజాత శిశువు ఈ మహమ్మారి వైరస్ భారిన పడిరది. వివరాు.. ముంబైలోని చెంబూర్ శివారులో నివసిస్తున్నఓ వ్యక్తి గతవారం గర్భవతి అయిన తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడే ఆరోగ్యవంతమైన శిశువుకు ఆమె జన్మనిచ్చింది. కొన్నిరోజు తర్వాత వారు ఉన్న గదిలోనే ఒక రోగిని జాయిన్ చేశారు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాు చెప్పలేదు. దీంతో తన భార్య, మూడు రోజు పసికందు కోవిడ్ -19 భారినపడ్టారని, తన కుటుంబాన్ని ఆదుకోవాంటూ ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేకు విజ్ఞప్తి చేశాడు.‘నన్ను, నా భార్య, శిశువుకు కరోనా పరీక్షు చేయడానికి పదమూడు వే రూపాయు వసూు చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో వాళ్లకేమైనా వైరస్ అంటుకుందేమోనని, నా భార్య, బిడ్డకు రోజువారి హెల్త్ చెకప్ కూడా నిర్వహించలేదు. ఫలితాు వచ్చే వరకు అక్కడే ఉంటామని విన్నవించుకున్నా ఆసుపత్రి మూసివేస్తున్నట్లు చెప్పి మమ్మల్ని బవంతంగా బయటికి గెంటేశార’ని సదరు వ్యక్తి వాపోయాడు. ఇప్పుడు కస్తూర్బా ఆస్పత్రిలో తన కుటుంబం చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని, ఇకనైనా తన భార్య, బిడ్డకు మెరుగైన చికిత్స అందించేలా చూడాని మోదీకి విన్నవించుకుంటూ ఓ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. తన కుటుంబాన్ని అపాయంలోకి నెట్టేసిన వైద్యసిబ్బందిపై చర్యు తీసుకోవాని పేర్కొన్నాడు. ఇక మహారాష్ట్రలో కరోనా బాధితు సంఖ్య 300 దాటగా, మ ృతు సంఖ్య 13కి చేరింది.