తెలుగు రాష్ట్రాలనుంచి గూడ్స్‌

ఆహార కొరత ఉన్న రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ పంపిణీ ఏర్పాట్లు

న్యూఢల్లీి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశంలో 21 రోజు లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం వారికి ఆహారధాన్యాు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆహారధాన్యా కొరత ఉన్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాకు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రజా పంపిణీ ద్వారా రెండు రెట్లు అధిక ధాన్యాన్ని సరఫరా చేస్తోంది. గత రెండు రోజుల్లోనే 85 రైళ్ల ద్వారా అవసరమైన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాకు అందించింది.ఆహారధాన్యాు అధికంగా భిస్తున్న పంజాబ్‌, హర్యానా, తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా నుంచి  కొరత ఉన్న రాష్ట్రాకు తరలిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రం నుంచి అధికంగా 60 శాతం వరకు  తరలించినట్లు అధికాయి తెలిపారు. లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో ప్రస్తుతం ఇచ్చే 5 కేజీ ఆహారధాన్యాకు అదనంగా మరో 5 కేజీను ఉచితంగా అందిస్తానని మార్చి 24న కేం?ద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలియన్‌టన్ను ఆహారధాన్యాను కొరత ఉన్న ఆయా రాష్ట్రాకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది.ఏప్రిల్‌లో అందించేందుకు కావల్సిన ధాన్యాను ఇప్పటికే ఎఫ్‌సీఐ సరఫరా చేసింది. ఏప్రిల్‌ నెలో 5 మిలియన్‌ టన్ను ధాన్యాన్ని తరలించనున్నామని ఎఫ్‌సీఐ చైర్మన్‌ డీవీ ప్రసాద్‌ తెలిపారు.  ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న ధాన్యంతో కలిసి అన్ని రాష్ట్రాకు సరిపడ ఆహారధాన్యాు   ఎఫ్‌సీఐ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా నెకు 5 కేజీ చొప్పున సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రా వద్ద 4నుంచి 6 నెలకు సరిపడా రేషన్‌ ఉందని అయితే లాక్‌డౌన్‌ కారణంగా అదనంగా  అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈ పరిస్థితు ఏర్పడ్డాయని తెలిపారు.దీంతో పాటు పంజాబ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాు మూడు నెల రేషన్‌ను ఒకేసారి అందించనున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా వినియోగదాయి ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాు కూడా అదనంగా 5 కేజీ ధాన్యాు ఇవ్వడానికి అంగీకరించాయి. దీనితో ఆహారధాన్యాను ఎక్కువగా సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఏప్రిల్‌ మధ్యలో నుంచి ఆహారధాన్యా సేకరణ మొదుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేదకు ఆహారధాన్యాు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తొస్తోంది.