లాక్ డౌన్ వేళ.. పెరిగిన గృహ హింస
జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ) దృష్టికి 58 ఫిర్యాదులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్ కొందరు మహిళలకు మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతోంది. ఇళ్లకే పరిమితమవుతున్న కొందరు పురుషులు తమ అసహనాన్ని భార్యల పై ప్రదర్శిస్తూ గృహహింసకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వారం వ్యవధిలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ)కి మొత్తం గృహ హింసకు సంబంధించి 58 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం ఉత్తరాది రాష్ట్రాల నుంచే, ముఖ్యంగా పంజాబ్ నుంచే వచ్చాయని ఎన్ సీడబ్ల్యూ ఛైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.