లాక్‌డౌన్‌ పొడిగింపు యోచన లేదు

కేంద్రం స్పష్టీకరణ

న్యూఢల్లీి:  కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజు పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తు నిరాధారమైనవని తెలిపింది. ‘‘అలాంటి లాక్‌డౌన్‌ పొడగింపు ఊహాగానాు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పొడగించే యోచనేమీ లేదు’’ అని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా స్పష్టం చేశారు.
కరోనా వైరస్‌ దేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గత మంగళవారం 21రోజు లాక్‌డౌన్‌కు పిుపునిచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి దేశవ్యాప్తంగా జనసంచారంపై కఠిన ఆంక్షు కొనసాగుతున్నాయి. అయినా కొత్తగా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో లాక్‌డౌన్‌ని మరికొన్ని రోజు పాటు కొనసాగించే అవకాశం ఉందని వదంతు వ్యాప్తించాయి. తాజాగా వీటిని కేంద్రం కొట్టివేసింది.
మరోవైపు భారత్‌లో కరోనా బాధితు సంఖ్య 1071కు చేరగా.. మ ృతు సంఖ్య 29గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వ్లెడిరచింది.
ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజ ృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా బాధితు సంఖ్య 1071కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వ్లెడిరచింది. వీరిలో 29మంది మరణించగా 942మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 100మంది కొవిడ్‌-19నుంచి కోుకున్నారని తెలిపింది.
మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మ ృతు సంఖ్య 8కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో 218కేసు నమోదుకాగా ఇప్పటివరకు 25మంది కోుకున్నట్లు అధికాయి వ్లెడిరచారు. కేరళలో 213కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకాగా ఒకరు మరణించారు. గుజరాత్‌లో కొవిడ్‌-19 మ ృతు సంఖ్య ఐదుకు చేరింది. కర్ణాటకలో ఈ కేసు సంఖ్య 85కి చేరగా ముగ్గురు మరణించారు. దిల్లీ, మధ్యప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్‌19 కారణంగా ఇద్దరు మరణించారు. బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, తెంగాణ, పశ్చిమబెంగాల్‌లో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వ్లెడిరచింది. తెంగాణలో ఇప్పటివరకు 70కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు సంఖ్య 21 చేరినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాు ప్రకటించాయి. అయితే ఈ సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యు సామాన్యుకు ఇబ్బంది కలిగిస్తే క్షమించాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న అభ్యర్థించారు. కరోనా మహమ్మారిని జయించడంలో ఇలాంటి చర్యు తప్ప వేరేమార్గం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
వసవాసు కష్టాపై సుప్రీం విచారణ
దేశంలో విధించిన 21రోజు లాక్‌డౌన్‌ సమయంలో నగరా నుంచి కార్మికు, వస కూలీు తమ స్వస్థలాకు కాలినడకన ప్రయాణించడం కలిచివేస్తోంది. చిన్నప్లిు, వ ృద్ధు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడివారు అక్కడే ఉండాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు విజ్ఞప్తిచేస్తున్నా వేసంఖ్యలో కూలీు కాలినడకన బయుదేరుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో తాజాగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై నేడు విచారించే అవకాశం ఉంది. ఈ సమయంలో రోజువారీ, వస కూలీు తమ సొంత ప్రాంతాకు వెళ్లకుండా ప్రస్తుతం ఉన్నచోచే ఉండాని కేంద్రప్రభుత్వం సూచించింది. వారికి భోజన వసతి కలిపించేందుకు అన్నిరాష్ట్రాు చర్యు తీసుకోవాని ఇప్పటికే రాష్ట్రాకు సూచించింది.
ఇదిలా ఉంటే, దిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో కరోనా బాధితుకు చికిత్స అందిస్తోన్న ఓ నర్సు ఆదివారం ఆస్వస్థతకు గురయ్యారు. జ్వరం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన అధికాయి ఆ నర్సుతో పాటు మరో 14మంది వైద్య సిబ్బంది శాంపిల్స్‌ సేకరించారు. వాటిని కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష కోసం పంపించారు. ప్రస్తుతం ఆ14మందిని హోం క్వారంటైన్‌లో ఉండాని సూచించారు.