ఐటీ రిటర్న్స్‌ దాఖులకు గడువు పొడిగింపు

కరోనాను తట్టుకునేందుకు ఉద్దీపన పథకాలు ప్రకటించిన కేంద్రం

న్యూఢల్లీి: ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు సీతారామన్‌ స్పష్టం చేశారు. దిల్లీలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌తో కలిసి సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకాు ప్రకటించనున్నట్లు గత కొద్ది రోజుగా వార్తు వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తీసుకున్న నిర్ణయాను సీతారామన్‌ మీడియాకు వివరించారు.
‘2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్ను దాఖుకు 2020 జూన్‌ 30 వరకు గడువు పొడిగించాం. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపు ఆస్య రుసుము 12 నుంచి 9 శాతానికి, టీడీఎస్‌ జమలో ఆస్య రుసుమును 18 నుంచి 9 శాతానికి తగ్గించాం. ఆధార్‌-పాన్‌ అనుసంధానం, ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం గడువును జూన్‌ 30 వరకు పొడిగించాం. పన్ను వివాదా మొత్తా చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొగించాం. మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్న్‌ దాఖు గడువు జూన్‌ 30 వరకు పొడిగించాం. కాంపొజిషన్‌ స్కీమ్‌ రిటర్న్‌ దాఖుకు కూడా జూన్‌30 వరకు గడువును పొడిగించాం. రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీపై పన్ను చెల్లింపు ఆస్య రుసుము ఉండవన్నారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ పైబడిన పెద్ద కంపెనీకు పన్ను చెల్లింపుపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించాం’ అని సీతారామన్‌ తెలిపారు.