కరోనాపై ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢల్లీి: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 492 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్లెడిరచారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారు..కానీ, కరోనా వైరస్‌ రాకుండా ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రజు సిద్ధంగా ఉండాని సూచించారు. ‘‘కరోనా మహమ్మారి ఇటలీని ఏవిధంగా పట్టిపీడిస్తుందో చూస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాను ప్రజంతా తప్పకుండా పాటించాలి. నిన్నటి వరకు విదేశా నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరుతున్నా. కరోనా కట్టడిపై ప్రధాని మోదీ ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. విమానాశ్రయాల్లో 15.24క్ష మందికి స్క్రీనింగ్‌ చేశాం. కరోనా నుంచి 37 మందిని డిశ్చార్జి చేశాం. విదేశా నుంచి వచ్చి సొంత ఇళ్లలో ఉన్నవారిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం. 436 మందిని ఇళ్లలోనే ఉంచి వైద్య చికిత్స చేయిస్తున్నాం. 5క్ష పీపీ కిట్లు, 10క్ష మాస్కు సిద్ధం చేశాం. పీపీ కిట్లు, మాస్కును ఇతర దేశాకు ఎగుమతి చేయకుండా నిషేధం విధించాం. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసు నిలిపివేశాం. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశీయ సర్వీసు కూడా నిలిపివేస్తున్నాం. విమానాశ్రయాల్లో రోజు తరబడి ఉండొద్దని కోరుతున్నాం. దేశంలోని 107 ఇమ్మిగ్రేషన్‌ కేంద్రాను పూర్తిగా మూసివేస్తున్నాం. కరోనా కేసు సున్నా అయ్యే వరకు జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో ఉండాలి ’’అని కిషన్‌రెడ్డి కోరారు.