ఇంటి నుంచే వాదించండి
కరోనా ప్రభావంతో న్యాయవాదులకు సూచించిన సుప్రీంకోర్టు
న్యూఢల్లీి: కరోనా వైరస్ రోజురోజుకీ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని తెలిపింది. అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాని సూచించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. న్యాయవాదుకు కొన్ని ‘లింక్’ు ఇస్తామని.. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని వీడియో కాల్ కనెక్ట్ చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే వివరించారు. అప్పటి వరకు కోర్టు భవనంలోని లాయర్ల ఛాంబర్లన్నీ మూసివేయాని సిబ్బందిని ఆదేశించింది.
లాయర్ల ఎక్ట్రానిక్ పాస్‌ను కూడా రద్దు కూడా చేశారు. నేటి సాయంత్రం ఐదు గంట నుంచి కోర్టులోని లాయర్ల ఛాంబర్లన్నింటినీ మూసివేయనున్నారు. రేపు సాయంత్రం కల్లా ఏమైనా ముఖ్యమైన పత్రాు ఉంటే న్యాయవాదు తీసుకెళ్లాని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనాను కట్టడి చేయాంటే కఠిన ఆంక్షు తప్పవని తెలిపింది. కేంద్ర ఆదేశాకు అనుగుణంగానే కోర్టు కూడా తాజా నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 415 కరోనా కేసు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు మ ృతిచెందారు.
దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించగా.. తెంగాణ సహా పు రాష్ట్రా ప్రభుత్వాు ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా కీక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదను వినిపించాని సూచించింది.
ఇకపై న్యాయవాదు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని, అత్యవసర కేసుకు సంబంధించి న్యాయవాదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తమ వాదను వినిపించాని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, న్యాయవాదుకు కొన్ని లింకు ఇస్తామని, ఆ లింకు ద్వారా వీడియో కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చని సీజేఐ తెలిపారు. స్కైప్ ద్వారాగానీ, మరేఇతర సాధనా ద్వారాగానీ లాయర్లు తమ వాదను వినిపించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలావుంటే, కోర్టు భవనంలోని లాయర్ల చాంబర్లు అన్నింటిని సోమవారం సాయంత్రం 5 గంట నుంచి మూసివేయాని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే న్యాయవాదు ఎక్ట్రానిక్ పాసును కూడా రద్దుచేసిన సుప్రీంకోర్టు.. కోర్టులో లాయర్లకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే మంగళవారం సాయంత్రానికల్లా తీసుకెళ్లాని సూచించింది.