బయటకొస్తే ఉపేక్షించం
మీడియా సమావేశంలో ఈటల హెచ్చరిక ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందీ విధులకు రావాలి
హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజు పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని తెంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ సూచించారు. అలాంటి వారు స్వీయ నియంత్రణ పాటించాని.. కుటుంబసభ్యు కూడా వాళ్లని బయటకు వెళ్లకుండా చేయాన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33కి చేరిందనిని ప్రకటించారు. మరో 97 మంది అనుమానితు ఉన్నారని.. వారి నివేదికు రావాల్సి ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈట మాట్లాడారు. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లను 14 రోజు తర్వాత పరీక్షు చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. వారిపై కేసు తప్పవని మంత్రి హెచ్చరించారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసి వాళ్లను పట్టుకుంటామన్నారు.
మొన్నటి స్ఫూర్తి ఏమైంది?
జనతా కర్ఫ్యూలో చూపిన స్ఫూర్తిని జనం ఈ రోజు చూపించడంలేదని ఈట ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నె 31 వరకు ప్రజు ఇళ్లల్లోనే ఉండాని లాక్‌డౌన్ ప్రకటిస్తే.. కొందరు మాత్రం ఏదో కొంపు మునిగిపోతున్నట్టుగా బయటకు వస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రాణాు ముఖ్యమా?వారం రోజు పనిముఖ్యమా?అని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యు చేపట్టిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ అనుమానిత క్షణాు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెవు రద్దు చేశామని.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది సైతం విధుకు రావాని స్పష్టం చేశారు. పరిస్థితి విషమిస్తే ప్రైవేట్ ఆస్పత్రును వినియోగించుకుంటామన్నారు. సాధారణ ఓపీు, అత్యవసరం కాని చికిత్స కోసం ఆస్పత్రుకు వెళ్లొద్దని కోరారు.
స్టేజ్-2లో ఉన్నాం.. స్టేజ్-3 రానీయొద్దు..
ఈ పది రోజు చాలా కీక సమయమని.. ఓపికతో ఉంటే దీన్ని తరిమికొట్టే అవకాశం ఉంటుందని ఈట చెప్పారు. బాధితు సంఖ్య పెరగకుండా ముందు జాగ్రత్తు పాటిద్దామని పిుపునిచ్చారు. వైరస్ సోకిన తర్వాత నయం చేయడం చాలా కష్టమనే విషయం ప్రపంచానికి అర్థమైందన్నారు. నిత్యావసరా కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాని.. ఎవరికి వాళ్లు ఇళ్లలో ఉండటమే కరోనా నిరోధానికి సరైన చికిత్స అని ఆయన వివరించారు. ఇవాళ స్టేజ్-2లో ఉన్నామని.. స్టేజ్-3 పరిస్థితి రానీయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు అందరూ సహకరించాని.. ఈనె 31 వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాని ప్రజకు ఈట సూచించారు.