శానిటైజర్, మాస్క్ ధరలు పెంచితే కఠిన చర్యులు
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్
న్యూఢల్లీి: దేశంలో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని ఆసరాగా చేసుకుని శానిటైజర్, మాస్క్ ధరు చుక్కనంటుతున్నాయి. రిటైల్ దుకాణాలే కాకుండా ఆన్‌లైన్ సంస్థు కూడా వీటి రేట్లను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈ దోపిడీని అరికట్టడానికి కేంద్ర వినియోగదారు వ్యవహారా శాఖ మంత్రి రామ్ విలాస్ పాశవాన్ హెచ్చరికు జారీ చేశారు. 200 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ ధర రూ.100, మాస్క్ ధర రూ.10కి మించరాదని ఆయన ప్రకటించారు. ఈ ఆదేశాు 30 జూన్, 2020 వరకూ అములో ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితు సంఖ్య 271కి చేరింది. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాంటే చేతును శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం అతి ముఖ్యమని నిపుణు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కుకు డిమాండు విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని వాటి ధరు పెంచి విక్రయిస్తున్నారంటూ పువురు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని కంపెనీు మాస్కు, శానిటైజర్లను 15 రెట్ల అధిక ధరకు కూడా అమ్ముతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటి ధరను నియంత్రిస్తూ కేంద్రప్రభుత్వం హెచ్చరికు జారీచేసింది.