మహారాష్ట్రపై కరోనా పంజా
65కు చేరిన కేసుల సంఖ్య..ఒక్కరోజే 11 కేసులు నిర్ధారణ
ముంబై : ప్రపంచ దేశాలను అతలాకుతం చేస్తున్న మహ్మమారి కరోనా వైరస్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని తీవ్రంగా చూపుతోంది. దేశంలో కరోనా కేసు రోజురోజుకూ వేగంగా పెరుగుతున్నాయి. మహమ్మారి కరోనా ధాటికి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 11 కేసు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసు సంఖ్య 65కి చేరుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే ఓ ప్రకటన విడుద చేశారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా బాధితు సంఖ్య 271కి చేరింది. దేశం మొత్త మీద ఇప్పటివరకు ఢల్లీి, కర్ణాటక, పంజాబ్, ముంబైలో ఒకొక్కరు చొప్పున నుగురు కోవిడ్ కారణంగా మరణించిన విషయం తెలిసిందే.కరోనా (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పుణే, పింప్రి-చించ్‌వడ్, నాగపూర్‌లోని అన్ని కార్యాయాు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నె 31వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని సీఎం తెలిపారు. కాగా.. ఈ నగరా నుంచే ప్రజు ఎక్కువగా విదేశాకు వెళ్లారని, ప్రస్తుతం వారు తిరిగి ఇండియాకు వస్తున్నారని పేర్కొన్నారు. దీంతో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలిన సూచించారు. ‘ప్రస్తుతం మనం సంకటంలో ఉన్నాం. కుటుంబ సభ్యుతో బయటకు వెళ్లి సంతోషంగా గడపడానికి కాదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశ ప్రజకు ఇచ్చిన సందేశం మాదిరిగా మనల్ని మనం గ ృహ నిర్భంధం చేసుకోవాలి. ముంబైకర్లు ఇంటివద్దే ఉండి కరోనా వైరస్‌పై యుద్ధం చేయాలి’అని అన్నారు. 1-8 తరగతు పరీక్షు రద్దు కరోనా (కోవిడ్-19) వైరస్ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షు రద్దు చేయాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతు విద్యార్థుకు పరీక్షు నిర్వహించకుండా తరువాతి తరగతుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం ప్రకటించారు. తొమ్మిది, 11వ తరగతి విద్యార్థు మిగిలిన పరీక్షను ఏప్రిల్ 15వ తేదీ తర్వాత జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి ఉపాధ్యాయు మినహా మిగతా టీచర్లు ఇంటి నుంచే పని చేయాని గైక్వాడ్ సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాు జారీ చేసింది. ఏసీ వినియోగాన్ని తగ్గించుకోవాంటూ ఇవాళ సూచించింది. కోవిడ్19 నేపథ్యంలో ఈ ఆదేశాు జారీ చేస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏసీ వినియోగాన్ని తగ్గించాంటూ తమ సూచనల్లో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఏసీ డక్ట్స్, వెంట్స్ నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాు ఉన్నట్లు తొస్తోంది. ఎయిర్ కండీషన్డ్ రూముల్లో వైరస్ ఎక్కువ సమయం సజీవంగా ఉండే అవకాశాు ఉన్నాయి. అందుకే గవర్నమెంట్, ప్రైవేటు ఆఫీసుల్లో ఏసీ వినియోగాన్ని పరిమితం చేయాని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఏసీకు బదుగా ఫ్యాన్లను ఎక్కువ వాడడం బెటర్. గాలిలో ఉన్న వైరస్ త్వరగా సెటిల్ కావాంటే, ఆ గాలి ఎక్కువ డిస్టర్బ్ కావాల్సి ఉంటుంది. అయితే ఏసీ వ్ల గాలి కదలిక అంతగా ఉండదు. అందుకే ఎక్కువగా ఫ్యాన్లు వినియోగించడం ఉత్తమం.