రామనవమి మేళా జరిపిస్తాం

యోగి సర్కారు కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా విజృంభించడంతో ప్రజు సామూహికంగా గుమిగూడటంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాు దాదాపుగా నిషేధం విధించాయి. యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా యూపీలో దాదాపు దీనినే ఫాలో అయిపోయింది. అయితే శ్రీరామ నవమి ఉత్సవాను మాత్రం ఘనంగా నిర్వహించేందుకు యోగి సర్కారు కృత నిశ్చయంతో ఉంది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ కారణంగా 50 మంది కంటే అధికంగా గుమిగూడదని స్వయంగా యోగి సర్కారు ఆదేశాు జారీ చేసినా కూడా మార్చి 25 న ‘శ్రీ రామ నవమి మేళా’ ను నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తోంది. అయోధ్యలో రామ మందిరానికి అనుకూంగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో ఈసారి రామ నవమిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌ కూడా పెద్ద పెద్ద సమావేశాు, ర్యాలీు నిర్వహించడానికి దూరంగా ఉంది. అయితే రామ నవమి రోజున మాత్రం పెద్ద పెద్ద ర్యాలీు నిర్వహించబోమనీ, అన్ని వీధుల్లో మాత్రం చిన్న చిన్న సమావేశాు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్‌ నేత అంబరీశ్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో రామ జన్మభూమి ఉద్యమం గురించి, కరసేవ గురించి ప్రజకు గుర్తు చేస్తామని తెలిపారు.
అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కూడా కాషాయ జెండాను ఎగురవేస్తామని, రామ నవమి ఉత్సవాన్ని ప్రజు జరిపేలా చూస్తామని ప్రకటించారు. అయితే ఈ ఉత్సవాపై యూపీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికాయి స్పందించారు. భారీ ర్యాలీకు, సమావేశాకు అనుమతి ఇవ్వొద్దంటూ సీఎం యోగి నుంచి స్పష్టమైన ఆదేశాు ఉన్నప్పటికీ, ఈసారి రామనవమి ఉత్సవాకు తగిన ముందుజాగ్రత్త చర్యు తీసుకుంటామని పేర్కొన్నారు.