పాపం…హిట్‌ సినిమాున్నా ఆఫర్స్‌ మాత్రం నిల్‌

నిధి అగర్వాల్‌ పరిచయం అవసరంలేని హీరోయిన్‌. యూత్‌ లో ఆమెకు ఉండే ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్‌ గా ఉంటూ వయ్యారాు ఒకబోసే ఫోటోు పోస్ట్‌ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. హిందీ సినిమా ‘మున్నామైఖెల్‌’తో బాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్‌.. తొలి సినిమాతోనే అందాు ఆరబోస్తూనే తన డాన్సుతో అదరగొట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా తొగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి తర్వాత అఖిల్‌ హీరోగా వచ్చిన ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాు పెద్దగా విజయం సాధించకపోయినా టాలీవుడ్‌ లో తన పేరు గుర్తుండిపోయేలా చేసాయి. గత ఏడాది డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్లో రామ్‌ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీలో నటించిన నిధి అగర్వాల్‌ ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంతో హీరోయిన్‌ గా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది.
అయితే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో నటించినా తొగులో మాత్రం తనకు అవకాశాు మాత్రం రావడం లేదంట. తొగులో మహేష్‌ బాబు మేన్లుడు అశోక్‌ గల్లాతో చేస్తున్న సినిమా మినహా ఆమె చేతిలో మరో తొగు సినిమా లేదని సమాచారం. ఈ మధ్య ఒక ప్రముఖ కథానాయకుడి తో నటిస్తుందని వార్తు మెవడినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. హిట్‌ సినిమా చేసిన తర్వాత కూడా టాలీవుడ్లో పెద్ద ఆఫర్లు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన నటనతో డాన్సుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా అద ృష్టం మాత్రం కలిసి రావడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే నిధి అగర్వాల్‌ ఈ ఏడాది పు చిత్రాతో కన్నడ మరియు తమిళంలో అడుగుపెట్టనుంది. రాబోయే రోజుల్లో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చి టాలీవుడ్‌ లో అగ్ర కథానాయకిగా నిలిచి పోవాని అభిమాను కోరుకుంటున్నారు.