‘తాజ్‌’కు తాత్కాలిక బ్రేక్‌

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రకటన

ఆగ్రా: కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసు సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాు పటిష్ఠ చర్యకు ఉపక్రమించాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలు, విశ్వవిద్యాయాతో సహా అన్ని విద్యాసంస్థను మూసివేయాని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాకు సూచను జారీ చేసిన విషయం తెలిసిందే. అన్ని థియేటర్లు, వ్యాయామశాలు, మ్యూజియరు, సాంస్క ృతిక, సామాజిక కేంద్రాు, ఈత కొను మూసేయాని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో తాజ్‌ మహల్‌ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు 126 కరోనా కేసు, మూడు మరణాు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో టికెట్ల ద్వారా ప్రవేశానికి అనుమతించే అన్ని చారిత్రక కట్టడాు, ప్రదర్శన శాలు, మ్యూజియాను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్టు పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రకటించారు. తాజాగా భారత ప్రభుత్వం ఐరోపా సమాఖ్యలోని దేశాతో సహా టర్కీ, బ్రిటన్‌ నుంచి వచ్చే పర్యాటకు ప్రవేశాన్ని కూడా బుధవారం నుంచి నిషేధించింది.