ఘటన సమయంలో ఢల్లీిలో లేను
ఢల్లీి కోర్టులో తాజాగా ముకేష్‌సింగ్ పిటిషన్ దాఖు
న్యూఢల్లీి: ఉరి అము తేదీ దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషు శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాు చేస్తున్నారు. నుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తాజాగా దిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను దిల్లీలోనే లేనని పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 17, 2012న రాజస్థాన్ నుంచి పోలీసు తనని దిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తిహాడ్ జైులో తనను చిత్రహింసకు గురిచేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాని కోరాడు. ఈ మేరకు దిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్‌ని ఉంచాడు. ఈ నె 20న ఉదయం 5:30గంటకు ఉరితీయాని మార్చి 5న ట్రయల్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మరణశిక్ష అము వాయిదా వేసేందుకు నిర్భయ దోషు అక్షయ్ ఠాకూర్ (31), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేశ్‌సింగ్ (32) శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. న్యాయపరమైన అవకాశా పేరిట వారు పిటిషన్లు దాఖు చేయడంతో ఉరి అము తేదీ మూడుసార్లు వాయిదా పడిరది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి, మార్చి 2న మూడో సారి డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడిరది. చివరకు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తుపు కూడా తట్టారు. తమకు ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాని ఐసీజేను కోరారు. దోషు తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఈ మేరకు ఒక పిటిషన్ దాఖు చేశారు. మరోవైపు తనకున్న చట్టపరమైన పరిష్కార మార్గాన్నిటినీ పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ముకేశ్ సింగ్ దాఖు చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.