మీడియా ఆదర్శవంతంగా పనిచేస్తోంది

బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో కరోనా కట్టడిపై మీడియాకు ప్రధాని మోదీ కితాబు

న్యూఢల్లీి: దేశమంతా క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రజల్ని కవరపాటుకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో విశేష కృషి చేస్తున్న వివిధ రంగాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా బాధితుకు, అనుమానితుకు విశేష సేవందిస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని అభినందించారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్న మీడియా పాత్రను కూడా ప్రధాని కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ మీడియా ఆదర్శంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఎలాంటి వదంతు వ్యాప్తి చెందకుండా.. ప్రజకు కచ్చితమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని చేరవేస్తోందని కితాబిచ్చారు. అవగాహన కార్యక్రమాల్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యు చేశారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజకు అవగాహన కల్పించాని ఎంపీకు మోదీ సూచించారు. ప్రతి సభ్యుడు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించాని ఆదేశించారు. అవసరమైన చోట వైద్య వసతుల్ని పెంచేలా చర్యు తీసుకోవాని కోరారు. వైరస్‌ విషయంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాల్సిన అసవరం ఉందని అందుకనుగుణంగా కార్యక్రమాల్ని రూపొందించాని దిశానిర్దేశం చేశారు.