అనిల్‌ అంబానీకి సమన్లు

ఎస్‌ బ్యాంక్‌ వ్యవహారంపై సమన్లు జారీ చేసిన ఈడీ

న్యూఢల్లీి: యెస్‌బ్యాంక్‌ సంక్షోభంలో మరో కీక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో అధికాయి అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అనిల్‌ అంబానీకి సమన్లు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ముంబయిలోని ఈడీ కార్యాయంలో సోమవారం హాజరు కావాని ఆయన్ను ఆదేశించింది. అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీు యెస్‌ బ్యాంకు నుంచి పొందిన రుణాు నిరర్థక ఆస్తుగా మారినట్లు ఈడీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణా వ్ల ఈ రోజు విచారణకు హాజరుకాలేనని అనిల్‌ అధికారుకు తెలిపినట్లు సమాచారం. అనిల్‌తోపాటు యెస్‌బ్యాంకు నుంచి రుణాు పొందిన ప్రధాన కంపెనీ ప్రమోటర్లందరికీ సమన్లు జారీచేసినట్లు ఈడీ అధికాయి తెలిపారు.
అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీు యెస్‌ బ్యాంకు నుంచి రూ.12,800 కోట్ల రుణాు తీసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ నిరర్థక ఆస్తుగా మారినట్లు తొస్తోంది. మార్చిన 6న నిర్వహించిన విలేకరు సమావేశంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ పేరు ప్రస్తావించారు. ఎస్సెల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ ప్రభావం యెస్‌ బ్యాంక్‌పై ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.