హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌రెడ్డి

మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాని పిటిషన్‌

హైదరాబాద్‌: డ్రోన్‌ కెమెరా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసుకు సంబంధించి ఆయన శుక్రవారం హైకోర్టులో 3 పిటిషన్లు దాఖు చేశారు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాని, మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాని పిటిషన్‌లో కోరారు. పార్లమెంట్‌ సమావేశాకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాని మరో పిటిషన్‌ దాఖు చేశారు.
కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ విషయాన్ని స్పీకర్‌ ఓం బిర్లా ద ృష్టికి తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పీకర్‌కు ఆమె లేఖ రాశారు. డ్రోన్‌ కేసులో రేవంత్‌రెడ్డిని తెంగాణ పోలీసు అరెస్ట్‌ చేశారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజకీయ కారణాతోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని స్పీకర్‌కు తెలిపారు. అక్రమ అరెస్టుపై వాయిదా తీర్మానం కోరిన ఆమె.. రేవంత్‌ రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి.. బెయిల్‌ రాకుండా ప్రభుత్వం చేస్తుందని లేఖలో అన్నారు. రేవంత్‌రెడ్డిని విడుద చేయాని కోరారు.
తమిళనాడులోని కరూర్‌ నియోజకవర్గం నుంచి గొపొందిన జోతిమణి.. చురుకైన రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ యూత్‌ లీడర్‌ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. తమిళ, మయాళం భాషతో పాటు ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగరు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనుచర గణంలో ఆమె ఒకరు. సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు.