ఫారూక్ అబ్దుల్లాకు విముక్తి
గృహనిర్బంధ ఆదేశాను రద్దుచేసిన కేంద్రం
హైదరాబాద్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఆయన్ను గృహనిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. గృహనిర్బంధం ఆదేశాను రద్దు చేస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు రిలీజ్ చేసింది. కశ్మీర్‌లో గత ఏడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందని పువురు నేతల్ని అరెస్టు చేశారు. అయితే సుమారు ఏడు నెల నిర్బంధం తర్వాత ఫారూక్ అబ్దుల్లాను విడుద చేయనున్నారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఆయన్ను అరెస్టు చేశారు. 83 ఏళ్ల ఫారూక్‌తో పాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీను కూడా నిర్భధించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒమర్ అబ్ధుల్లాపై పీఎస్‌ఏను ప్రయోగించారు. ఆ చట్టం ప్రకారం ఎటువంటి విచారణ లేకుండా రెండేళ్లు నిర్బంధంలో ఉంచవచ్చు. ప్రజా వ్యవస్థను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణపై ఆయన్ను అరెస్టు చేశారు. సాధారణంగా పీఎస్‌ఏ చట్టాన్ని ఉగ్రవాదు, వేర్పాటువాదు, రాళ్లు రువ్వే అ్లరి మూకపై ప్రయోగిస్తారు. కానీ తొలిసారి కేంద్ర ప్రభుత్వం పువురు ప్రధాన రాజకీయ నేతను అదుపులోకి తీసుకున్నది. గత ఏడాది డిసెంబర్‌లో ఫారూక్ డిటెన్షన్‌ను మరో మూడు నెల పాటు పొడిగించారు.