రౌడీషీటర్ల హల్చల్
కత్తిపోటుకు గురైన యువకు..పోలీసు అదుపులో నిందితు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో సోమవారం రాత్రి ముగ్గురు రౌడీషీటర్లు హల్చల్ చేశారు. నల్లీ బిర్యానీ తినడానికి వచ్చిన ముగ్గురు పాత నేరస్థు సిగరెట్ తాగే విషయంలో గొడవకు దిగారు. బెదిరింపుకు దిగడమే కాకుండా కత్తితో దాడికి ప్పాడ్డారు. బంజారాహిల్స్ పోలీసు కథనం ప్రకారం.. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్‌గా ఉన్న అమీర్ హుస్సేన్ (26), డబీర్‌పురకు చెందిన రౌడీషీటర్ మాలిక్ ఖాద్రి, మక్తడార్ హోటల్ ప్రాంతంలో నివసించే రౌడీషీటర్ ఒబేద్తోపాటు పురానీ హవేలికి చెందిన మొజంతో కలిసి సోమవారం రాత్రి 11 గంటకు బంజారాహిల్స్ రోడ్ నంబరు 12 కూడలిలోని కబారా డ్రైవిన్ హోటల్‌కు నల్లీ బిర్యానీ తినడానికి కారులో వచ్చారు. అక్కడ ఉన్న పాన్ దుకాణం వద్ద రౌడీషీటర్లకు చెందిన మరో ముగ్గురు వ్యక్తు సిగరెట్ తాగుతుండగా అక్కడ సిగరెట్ తాగొద్దని, బయటకు వెళ్లాంటూ డ్రైవిన్‌కు చెందిన వెయిటర్ శివ వారించాడు. అతన్ని ముగ్గురు యువకు బెదిరించారు. యజమాని ఆరిఫ్ గమనించి వారించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆరిఫ్ డ్రైవర్లు పవన్, అబ్దుల్ అక్కడికి వచ్చారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే అమీర్ తన వద్ద ఉన్న జాంబియా (కత్తి)తో పవన్‌పై దాడి చేశాడు. వెన్ను, పొట్ట, చేతుపై గాయాయ్యాయి. నకల్ పంచ్‌తో అబ్దుల్పై సైతం దాడికి అమీర్ ప్పాడ్డాడు. హోటల్ సిబ్బంది, స్థానికు రావడంతో వారంతా పరారయ్యారు. బంజారాహిల్స్ పోలీసు రంగంలోకి దిగి అమీర్‌తో పాటు ఖాద్రిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోతూ వారు పారేసిన జాంబియాను, చరవాణును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితు కోసం గాలిస్తున్నారు.