క్యాంపు..బెదిరింపు..బుజ్జగింపు

మధ్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం..బీజేపీ, కాంగ్రెస్‌ ఎత్తుకుపైఎత్తు

`బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా
`18 సంవత్సరాు కాంగ్రెస్‌కు సేవందించిన సింధియా
`చకచకా మారిపోతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయాు
`క్యాంపు రాజకీయాతో బిజీబిజీగా పార్టీు
`మధ్యప్రదేశ్‌ తర్వాత రాజస్థాన్‌పై బీజేపీ కన్ను
`కాంగ్రెస్‌లో 22 మంది రాజీనామాు
`ఆపరేషన్‌ కమంతో కాంగ్రెస్‌ కవరం

న్యూఢల్లీి:
తీవ్ర ఉత్కంఠ పరిణామ మధ్య మంగళవారం కాంగ్రెస్‌ను వీడిన ఆ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కమం గూటికి చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బుధవారం ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. తొుత ఈ రోజు 12.30 గంటకే భాజపాలో చేరుతారని వార్తలొచ్చినా చివరకు ఆయన ఈ మధ్యాహ్నం 2.30గంట తర్వాత భాజపా కేంద్ర కార్యాయానికి చేరుకున్నారు. ఆ తర్వాత భాజపా నేతతో కాసేపు చర్చు జరిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సింధియాకు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరలేచిన విషయం తెలిసిందే. సింధియాకు భాజపా రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం ఉన్నట్టు ఊహాగానాు వస్తున్నాయి.    
సింధియా భాజపాలో బుధవారం చేరతారన్న సమాచారంతో ఆయన నివాసం వద్దకు మద్దతుదాయి భారీగా చేరుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరుతున్న నేపథ్యంలో అభిమాను ఆయనతో పాటు మోదీ, అమిత్‌ షా ఫొటోతో దిల్లీలో భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. మరోవైపు, భోపాల్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాయంలో సింధియా గది వద్ద ఆయన నామ ఫకాన్ని అక్కడి సిబ్బంది మంగళవారమే తొగించారు.
మంగళవారం ఉదయం దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సింధియా భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం వారిద్దరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమై చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పరిణామా నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ వేటు వేస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. కమల్‌నాథ్‌ నేత ృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు సింధియా విధేయులైన 22 మంది ఎమ్మెల్యేు మద్దతు ఉపసంహరించుకోవడంతో  అక్కడి సర్కార్‌ తీవ్ర సంక్షోభంలో పడిరది.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియ అంతా అనుకున్నట్లే బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన ఢల్లీికి చేరుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే మంత్రి పదవిని కూడా ఆఫర్‌ చేసినట్టు తొస్తోంది. సింధియాకు మద్దతుగా రాజీనామా చేసిన మిగితా ఎమ్మెల్యేు కూడా బీజేపీు చేరనున్నట్టు తొస్తోంది.
మరోవైపు మధ్యప్రదేశ్‌ రాజకీయ పరిణామాు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీు జంపింగ్‌తో అర్ట్‌ అయ్యాయి. అనుమానం ఉన్న అందరి నేతపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టింది. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యేను రిసార్ట్స్‌కు తరలిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను అందర్నీ జైపూర్‌లోని రిసార్ట్స్‌కు తరలించారు. అటు బీజేపీ నుంచి కూడా వసు ఉంటాయనే ప్రచారంతో అర్ట్‌ అయ్యారు. వారిని క్యాంపుకు తరలిస్తున్నారు.
ఇటు రాజ్‌భన్‌కు చేరుకున్న గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాజకీయ పరిణమాను గమనిస్తున్నారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని బం నిరూపించుకోమని సూచించే అవకాశాు కనిపిస్తున్నాయి. అటు బీజేపీ సైతం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తోంది. కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడం.. ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమకు సరిపడ బం ఉండడంతో.. దీనిపై చర్చిస్తున్నారు. తమకు బనిరూపణకు అవకాశం ఇవ్వాని గవర్నర్‌ను కోరే అవకాశాు కనిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌ లో అధికార కాంగ్రెస్‌ కు ఎలాంటి అవకాశమివ్వకూడదని భావించిన బీజేపీ..తమ ఎమ్మెల్యేను బస్సుల్లో వేరే ప్రాంతాకు తరలిస్తుంది. భోపాల్‌ లోని పార్టీలో ఆఫీస్‌లో బుధవారం ఎమ్మెల్యేందరితో మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేందరినీ బీజేపీ…ప్రత్యేక బస్సుల్లో వేరే ప్రాంతాకు తరలిస్తుంది. అయితే తాము ఎక్కడికి వెళుతున్నది తమకి ఇంకా తెలియదని,ఢల్లీి లేదా బెంగళూరుకి తమ వెళ్లబోతున్నట్లు మాత్రమే తనకు తొసునని ఎమ్మెల్యే విజయ్‌ షా తెలిపారు. బస్సుల్లో ఎక్కిన బీజేపీ ఎమ్మెల్యేు మంచి ఉషారుతో పాట పాటు పాడుతూఎంజాయ్‌ చేశారు.  
మరోవైపు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుగా ఉన్న గోపాల్‌ భార్గవ,నరోత్తమ్‌ మిశ్రాు ఇవాళ(మార్చి-10,2020) మధ్యాహ్నాం మరికొందరు బీజేపీ నాయకుతో కలిసి భోపాల్‌ లో అసెంబ్లీ స్సీకర్‌ నివాసానికి వెళ్లారు. స్పీకర్‌ ఎన్‌ పీ ప్రజాపతిని కలిశారు. 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా లేఖను గోపాల్‌ భార్గవ స్పీకర్‌కు అందజేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేందరూ బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్‌ లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ప్రొసీజర్‌ ప్రకారం తగిన చర్యు తీసుకోబడతాయని స్పీకర్‌ ప్రజాపతి మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌ లో 22మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బుధవారం కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా  బీజేపీలో చేరిన విషయం విదితమే.
తర్వాత టార్గెట్‌ రాజస్థాన్‌
మధ్యప్రదేశ్‌ సంక్షోభం.. రాజస్థాన్‌లోనూ తలెత్తబోతోందా…? కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న విభేదాను బీజేపీ తమకు అనుకూంగా మార్చుకోబోతుందా ? మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రాజస్థాన్‌పై బీజేపీ ఫోకస్‌ పెట్టబోతోంది. అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలెట్‌ మధ్య పెరుగుతున్న దూరం..కాంగ్రెస్‌ను కవరపెడుతుంది. మధ్యప్రదేశ్‌ గుణపాఠంతో కాంగ్రెస్‌ మేుకోకపోతే…రాజస్థాన్‌ కూడా చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆపరేషన్‌ కమ కాంగ్రెస్‌ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సంక్షోభాన్ని సరైన సమయంలో పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న తాత్సారం చివరకు ఆ పార్టీ మ్యూం చ్లొంచుకునే వరకు వస్తోంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ వర్సెస్‌ జ్యోతిరాదిత్య సింధియా తరహా రాజకీయాలే రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. బోటాబోటీ మెజార్టీతో ఇతరు మద్దతుతో  కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. మధ్యప్రదేశ్‌ తరహాలోనే 20 మంది ఎమ్మెల్యేు అటు నుంచి ఇటు మారితే అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం.
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పోషించిన పాత్రనే రాజస్థాన్‌లో సచిన్‌ పైలెట్‌ పోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంలో సచిన్‌ పైలెట్‌ కీకంగా వ్యవహరించారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించినా… కాంగ్రెస్‌ అధిష్టానం…అశోక్‌ గెహ్లాట్‌ను సీఎంను చేసి.. పైలెట్‌కు డిప్యూటీతో సరిపెట్టింది. అప్పటి నుంచి సచిన్‌ పైలెట్‌ అసంత ృప్తితోనే ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి హోదాలో  అశోక్‌ గెహ్లాట్‌  తీసుకుంటున్న నిర్ణయాను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు సచిన్‌ పైలైట్‌.
ఇటీవ వజ్రా వ్యాపారి రాజీవ్‌ అరోరాను రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై సచిన్‌ పైలెట్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతను పక్కన పెట్టి వ్యాపారును రాజ్యసభకు పంపితే తప్పుడు సంకేతాు వెళ్తాయని గెహ్లాట్‌కు తన అసంత ృప్తిని తెలిపారు. కోటా ఆస్పత్రిలో ఇటీవ సంభవించిన చిన్నారు మరణాు కూడా రాజస్థాన్‌ ప్రభుత్వంలో ుకుకను బయటపెట్టాయి. చిన్నారు మరణా విషయంలో గెహ్లాట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని సచిన్‌ పైలెట్‌ ఆగ్రహంతో ఉన్నారు.  పేరుకు డిప్యూటీ సీఎంగా ఉన్నా… అశోక్‌ గెహ్లాట్‌ తీసుకుంటున్న నిర్ణయాు సచిన్‌ పైలెట్‌కు రుచించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్షను మొదు పెడితే…మధ్యప్రదేశ్‌ తరహా సంక్షోభమే తలెత్తుతుందని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెసె నేతు చెబుతున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో 200 సీట్లు ఉంటే… ప్రభుత్వానికి 112 మంది ఎమ్మెల్యే మద్దతుంది. వీరిలో ముగ్గురు సీపీఎం, ఒకరు ఆర్‌ఎల్డీ సభ్యు కూడా ఉన్నారు. బీజేపీకి రాజస్థాన్‌ అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేు ఉన్నారు. కనీసం 20 మంది ఎమ్మెల్యేు అటుఇటుగా మారితే… గెహ్లాట్‌ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మధ్యప్రదేశ్‌ పరిణామాతో  ఖంగుతిన్న సోనియా గాంధీ… ఇప్పటికే అశోక్‌ గెహ్లాట్‌ను ఢల్లీి పిలిపించినట్టు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేు చేసిన తిరుగుబాటుకు నె రోజు కిందటే బీజాు పడ్డాయా? రాజకీయ వర్గాు దీనికి ఔననే సమాధానం చెబుతున్నాయి. ఈ తిరుగుబాటు ఆకస్మికంగా జరిగింది కాదని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేతో బెంగళూరులో శిబిరం నిర్వహించాల్సి వస్తుందని కర్ణాటకలోని భాజపా నేతకు కొన్ని రోజు కిందటే సమాచారం ఉంది. విశ్వసనీయ వర్గా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే బస ఏర్పాట్లను కర్ణాటక భాజపా ఎమ్మెల్యే ఒకరు చూస్తున్నారు. దాదాపు 15-20 రోజు కిందటే ఆయనకు పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి సూచను వచ్చాయి. సదరు నేత ఫిబ్రవరి మూడో వారంలో దిల్లీ వెళ్లి, దీనిపై భాజపా పెద్దతో సమాలోచను జరిపి వచ్చారు.
నిజానికి మధ్యప్రదేశ్‌ నుంచి 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేు వారం కిందటే బెంగళూరు వచ్చారు. వీరిలో ఇద్దరు ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారు. మిగతా ఆరుగురు ఇక్కడే ఉన్నారు. వీరి బసను కూడా ఆ భాజపా ఎమ్మెల్యే పుమార్లు మార్చారు. వీరికితోడు మధ్యప్రదేశ్‌ నుంచి మరో 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేు సోమవారం ఒక అద్దె విమానంలో బెంగళూరు చేరుకున్నారు. తిరుగుబాటు నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఈ 19 మంది ఎమ్మెల్యేు నగరంలోని ఒక రిసార్టులో బస చేశారు. వీరిలో ఇద్దరు మహిళు ఉన్నారు. వీరు కనీసం రెండు వారా పాటు ఇక్కడే బస చేస్తారని సంబంధిత వర్గాు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం బాధ్యతు చేపట్టేవరకూ వీరి శిబిరం కొనసాగుతుందని వివరించాయి. ‘‘తొుత కమల్‌నాథ్‌ సర్కారుపై అవిశ్వాస పరీక్ష, ఆ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టాలి. అప్పటివరకూ బెంగళూరులో శిబిరం కొనసాగుతుంది’’ అని తెలిపాయి. మధ్యప్రదేశ్‌ శాసనసభ సమావేశాు ఈ నె 16 నుంచి ప్రారంభమవుతున్నాయి.
పోలీసు రక్షణ కల్పించండి
బెంగళూరులో బస చేసిన 19 మంది ఎమ్మెల్యేు తమకు భద్రత కల్పించాంటూ  కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. ‘‘ఒక ముఖ్యమైన పని మీద స్వచ్ఛందంగా కర్ణాటకలో ఉంటున్నాం. అందువ్ల మేం సురక్షితంగా ఇక్కడ సంచరించేందుకు, బస చేసేందుకు మీగా మాకు స్థానిక పోలీసుతో రక్షణ, ఎస్కార్టు సౌకర్యం కల్పించండి’’ అని వారు అందులో పేర్కొన్నారు.