రాజకీయాలో రాజుగారమ్మాయి

`నేడు ప్రపంచ మహిళా దినోత్సవం

బీజేపీ అధినేత అమిత్‌ షా శ్రీకాకుళం పర్యటన ద్వారా చాలామందికి తెలియని ఓ వ్యక్తి మెగులోకి వచ్చారు. ఆమె సంచైతా గజపతిరాజు. పూసపాటి రాజవంశీయు కుమార్తెగా ఆమె సభకు హైలైట్‌గా నిలిచారు. సంచైతా గజపతిరాజు మాజీ మంత్రి పి. ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె. సంచైత ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం అమిత్‌ షా సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంచైత తండ్రి ఆనందగజపతిరాజు, ప్రస్తుత ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత పి. అశోక్‌ గజపతిరాజుకి స్వయానా సోదరుడు. సంచైత గజపతిరాజు, ఆమె తల్లి ఉమా గజపతిరాజు విలాసవంతమైన లైఫ్‌ స్టయిల్‌కి ప్రతీకగా ఉంటారు. హై క్లాస్‌ మహిళా సర్కిల్స్‌లో, పార్టీల్లోనే కనిపిస్తుంటారు. రాజకీయాల్లోకి రావడంతో ఇప్పుడు ప్రజకు కనిపిస్తున్నారు.
తొగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు జగన్‌ ప్రభుత్వం ఇటీవలే ఓ షాక్‌ ఇచ్చింది. మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును తొగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మాన్సస్‌ ట్రస్ట్‌కు 108 ఆయాు, 14,800 ఎకరా భూము ఉన్నాయి. ఇందులో సింహభాగం భూము అశోక్‌ గజపతిరాజు కుటుంబమే ఉదారంగా ఇచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే. జగన్‌ ప్రభుత్వం ట్రస్ట్‌ చైర్మన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచైత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయించడం. నిన్న సింహాచం ఆయ చైర్మన్‌గా సంచైత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సంచైత గజపతిరాజు బీజేపీ ఢల్లీి అధికార ప్రతినిధిగా ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కు చెందిన నేతకు కాకుండా బీజేపీ నేతకు ఈ పదవి ఇవ్వడం విశేషం. రాజు గారి కుటుంబంలో చిచ్చు రేపడానికే ఇలా చేశారని కొందరి వాదన.
 అశోక్‌ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుటుంబా మధ్య కొంత కాం నుండి స్పర్ధు ఉన్నాయి. దీనితో ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. తొగుదేశం పార్టీ కీక నేతను దెబ్బకొట్టడానికి దేవాయాలోకి కూడా రాజకీయాను తెచ్చారు అని ఆ పార్టీ వారు ఆక్షేపిస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న అశోక్‌ గజపతిరాజు అడపాదడపా జగన్‌ ప్రభుత్వం మీద పరుషవ్యాఖ్యు చేస్తూ ఉంటారు. పైగా ఆయన విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆది నుంచి సింహాచం ఆయానికి ఆనువంశిక ధర్మకర్తుగా, పాకమండలి ఛైర్మన్‌గా పూసపాటి వంశీకు కొనసాగుతున్నారు. అశోక్‌ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు, ఆయన మరణానంతరం పెద్దకుమారుడు ఆనందగజపతిరాజు, ఆయన తదనంతరం 2016 నుంచి అశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్నారు. దాదాపు పదిహేనేళ్లుగా ఆయానికి పాకవర్గం లేదు. తాజాగా గతనె 20న పాకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. అందులో సంచైత గజపతిరాజుకు ఒక సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ఆమెను ఛైర్‌పర్సన్‌ చేస్తూ జీవో జారీచేయడం విశేషం.
ఎవరీ సంచైత
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచైత. విజయనగరం జిల్లాలో గ్రామ గ్రామం తిరిగి. ‘‘ఆడప్లిల్ని బడికి పంపించండి’’ అని త్లుల్ని కోరింది. ఆడప్లి బాల్యాన్ని, చదువును నీళ్లు మోయడం కోసం బలి చేయవద్దని వేడుకుంది. ‘‘నీళ్లు లేకపోవడం వ్లనే.. కేవం నీళ్లు మోయడానికే ఆడప్లిల్ని బడి మాన్పిస్తున్నట్లయితే… ఆ నీళ్లేదో నేనే ఇస్తాను’’ అంటోంది.. అనడమే కాదు స్కూళ్లల్లో సోలార్‌ పకు అమర్చి, నీటి శుద్ధి కేంద్రాను ఏర్పాటు చేసింది.ఈ వేసవిలో మరికొన్నింటిని చేయబోతోంది. ఇదంతా ఆడప్లిల్ని చదివించడానికే. ‘‘బడికి వచ్చి చదువుకోండి. ఇంటికి వెళ్లేటప్పుడు ఈ క్యాన్‌ నిండా మంచినీటిని మీ ఇంటికి పట్టుకువెళ్లండి’’ అని ఐదు లీటర్ల నీటి క్యాన్‌ను అమ్మాయి చేతికి ఇస్తున్నారు సంచయిత. రాజు గారమ్మాయి తమ వాడల్లోకి వచ్చి ఇంత ఆపేక్షగా చెబుతుంటే ఏ తల్లిదండ్రు మాత్రం అమ్మాయిల్ని బడికి పంపించకుండా ఉండగరు చెప్పండి? ఆమె చూపించిన ఆత్మీయతే ఆడప్లిల్లో అక్షరాస్యత పెంచాన్న ఆమె పనిని సువుగా మార్చేస్తోంది.
ప్యాలెస్‌లో పుట్టి..ప్రజ మధ్య పెరిగి..
‘‘నేను ప్యాలెస్‌లో పెరగలేదు, ప్రజ మధ్య పెరిగాను. మా తాత విజయరామ గజపతి రాజుగారు అభ్యుదయవాది. ఆడప్లిు చదువుకోవాని, ప్రజా జీవితంలో క్రియాశీకంగా ఉండాని చెప్పేవారు. నా చదువంతా ఢల్లీిలోనే సాగింది. మా అమ్మ లోక్‌సభ సభ్యురాలిగా (రాణి ఉమాగజపతిరాజు) ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఓ సారి నా స్కూల్‌కి నె రోజు సెవు పెట్టించి మరీ తనతోపాటు గ్రామాన్నీ తిప్పి చూపించింది. ప్యాలెస్‌కి పరిమితం కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి పని చేయాని అమ్మ చెప్పేది’’ అని చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంచైత.
ఢల్లీి యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌ ఆనర్స్‌, తర్వాత లా కోర్సు చేసి ఢల్లీి బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు సంచైత. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం ఆమెకంటూ ఒక ఉపాధి కోసం మాత్రమే. చుట్టుపక్క గ్రామాల్లో బాలిక విద్య కోసం పని చేయడం ఆమెకో సంతృప్తి.  ‘ఆస్తు వస్తుంటాయి, పోతుంటాయి. మనం చదువుకున్న చదువు మనతోపాటే ఉంటుంది. చదువుతోపాటు వచ్చిన జ్ఞానం మనల్ని నడిపిస్తుంది’ అనేవారు అమ్మ. ఆ మాటనే నేను పని చేస్తున్న విశాఖ జిల్లాలో అమ్మాయికు చెప్తున్నాను’’ అని సంచైత అన్నారు.
మహిళ సహకారం ఎంతో ముఖ్యం
‘‘ఇంట్లో ఇల్లాు సౌకర్యంగా ఉంటే ఆ ఇు్ల సంతోషంగా ఉంటుంది. సామాన్య కుటుంబాల్లో అమ్మాయి చదువు కోసం ఏం చేయాలి? ఎలా మొదు పెట్టాలి? అనే ప్రశ్న నాలో మొదలైంది. విశాఖ జిల్లా కలెక్టర్‌ దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. జిల్లా విద్యాధికారి, మండ అభివృద్ధి అధికారు ద్వారా స్కూళ్ల వివరాు, గ్రామాలో మౌలిక వసతు లేమి పట్ల స్పష్టత వచ్చింది.  మహిళు సర్పంచ్‌గా ఉన్న గ్రామాను ఎంపిక చేసుకుని వాళ్లను స్వయంగా కలిశాను. వాళ్ల మాటల్లో కూడా మంచి నీళ్లే మొదటి ప్రాధాన్యంలో ఉన్నాయి. మంచినీటి కోసం నేను ఏర్పాటు చేయానుకున్న పనుకు వాళ్ల సహకారం తీసుకున్నాను. వాటర్‌ ప్లాంట్‌ు, సోలార్‌ ప్యానల్స్‌, ఎనర్జీ జనరేషన్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి వాటిని ఏర్పాటు చేయగలిగాను. ఆ గ్రామాల్లోనే ఉన్న మహిళకు యంత్రా నిర్వహణ పను నేర్పిస్తే నేర్చుకోగలిగిన వాళ్లకు శిక్షణనిచ్చి సోలార్‌ ప్లాంట్‌, వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ బాధ్యత అప్పగించాము.. అని సంచైత తెలిపారు.
ఆడ`మగ అనే తేడా ఉండదు…
‘ఒక పనిని బాధ్యతగా చేయడానికి ఆడ-మగ అనే తేడా ఉండదు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ చేయగరు’ అని నిరూపించానేదే నా ఆశయం. పైగా ఆడవాళ్లయితేనే ప్లాంటును తమ ఇంటిని ఉంచుకున్నంత శుభ్రంగా ఉంచుతారు. అందుకే ఆడవాళ్లనే నియమించమని చెబుతుంటాను’’ అని తెలిపారు ఆమె. ఒక న్యాయవాది దృష్టి సామాజిక స్థితిగతు మీదకు మళ్లితే సమాజానికి న్యాయం జరుగుతుంది. అదే సామాజిక న్యాయం. స్త్రీ-పురుషు మధ్య వివక్షను రూపుమాపడానికి ఉద్యమించి విజయం సాధిస్తే అదే సమన్యాయం. సంచయిత శ్రమ… సామాజిక న్యాయం, సమన్యాయ సాధన కోసమే.
నేను విశాఖ అమ్మాయినే..
‘‘విజయనగరంలో పుట్టాను. అమ్మమ్మ గార్లిు మద్రాసు (చెన్నై)తో అనుబంధం పెంచుకున్నాను. అమ్మ సొంతూరు కేరళలోని పాల్ఘాట్‌. కానీ వాళ్ల కుటుంబం మద్రాసులో సెటిల్‌ అయింది. అమ్మ చదువు కూడా మద్రాసులోనే, స్టెల్లా మారిస్‌ స్టూడెంట్‌ ఆమె. ఢల్లీిలో ఉంటున్నాం. ఇన్ని ప్రాంతాు, ఇన్ని రాష్ట్రాతో మమేకమై సాగుతున్న నా జీవితంలో ప్రథమ స్థానం మాత్రం విశాఖదే’’ అని సంచైత అన్నారు.
చురుకైన కొత్త తరం : సంచయితా గజపతి రాజు
నేను దత్తత తీసుకున్న స్కూళ్లలో అమ్మాయితో మాట్లాడుతూ ‘పెద్దయిన తర్వాత నువ్వు ఏమవుతావు’ అని అడుగుతుంటాను. ఒకమ్మాయి ‘సోలార్‌ ఇంజనీర్‌ అవుతా’ అని చెప్పింది. అది విని నాకు చాలా ముచ్చటేసింది. ఇంజనీరింగ్‌ అంటే అది అబ్బాయి కోర్సు అనే అపోహ తొగిపోయినందుకు రిలీఫ్‌ కలిగింది. అమ్మతో పాటు పాతిక-ముప్పై ఏళ్ల కిందట చూసిన పరిస్థితు గ్రామాల్లో ఇప్పుడు లేవు. ఎనిమిదేళ్ల కిందట నేను సన (సోషల్‌ అవేర్‌నెస్‌ న్యూయర్‌ ఆ్టర్‌నేటివ్స్‌) సంస్థ నిర్వహకురాలిగా గ్రామాల్లో అడుగుపెట్టినప్పుడు కూడా మహిళల్లో ఈ మాత్రపు చొరవను చూడలేదు అని సంచైత గజపతి రాజు అన్నారు.
వేలాది ఎకరా భూము..
విద్యను ప్రోత్సహించే క్ష్యంతో పూసపాటి వంశీయులైన పీవీజీ రాజు 1958లో మహారాజా అక్‌నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టును స్థాపించారు. దీనికింద 12,716 ఎకరాు ఉండటం విశేషం. సింహాచం ఆయంతో పాటు, దీని పరిధిలో నాుగు జిల్లాల్లో 105 ఆయాకు కలిపి 9 వే ఎకరాు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం విశాఖ నగర పరిధిలో ఉండటంతో వీటి మివ భారీగా ఉంటుంది. దివంగత ఆనంద గజపతిరాజు, సుధా గజపతి రెండో కుమార్తె సంచైత గజపతిరాజు. ఆమె ప్రస్తుతం ఢల్లీిలో ఉంటున్నారు. భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున విశాఖలో ప్రచారం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ, విశాఖలో పు కార్యక్రమాు నిర్వహిస్తున్నారు. అశోక్‌ గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకు చెక్‌ పెట్టేందుకే ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచైతను వైకాపా తెరపైకి తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది.