ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితం

ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ

న్యూఢల్లీి: యెస్‌ బ్యాంకుకు చెందిన ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌తో మాట్లాడానన్నారు. ఈ అంశంలో సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్‌బీఐ కృషి చేస్తోందని వ్లెడిరచారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఖాతాదాయి, బ్యాంక్‌, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనా ద ృష్టిలో ఉంచుకొనే చర్యు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఖాతాదాయి రూ.50 వే వరకు తీసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యమన్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ సైతం ఇదే తరహా వ్యాఖ్యు చేశారు. యెస్‌ బ్యాంక్‌ పునర్నిణామానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామన్నారు. ఖాతాదారు సొమ్ము భద్రంగా ఉందని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపేందుకు ఆర్‌బీఐ క ృషి చేస్తోందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ హామీ ఇచ్చారు. యెస్‌ బ్యాంక్‌ విషయంలో తీసుకున్న నిర్ణయాు విస్త ృత స్థాయిలో తీసుకున్నవని తెలిపారు. భారత ఆర్థిక, బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థిరత్వం నెకొనే దిశగా చర్యు ఉంటాయన్నారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఇదే సరైన సమయం అన్నారు.