‘పెద్ద’ పీట ఎవరికో!

నేడు విడుదకానున్న రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్‌

`తెంగాణలో 2, ఏపీలో 4 రాజ్యసభ స్థానాు
`తెంగాణలో క్వకుంట్ల కవితకు సీటు
`రెండో సీటుపై నెకొన్న తీవ్ర ఉత్కంఠ
`ఏపీలోనూ 4 స్థానాపై రాని క్లారిటీ
`ఏపీలో బీజేపీ తరపున అంబానీ అనునాయకు ఒకటి
`మిగిలిన మూడులో బీసీకు ఒకటి
`రేసులో ఆళ్ల సోదరుడు అయోధ్యరామిరెడ్డి
`బీద మస్తాన్‌రావుకు సీటు ఇస్తున్నారంటూ ప్రచారం

హైదరాబాద్‌:
మొత్తం 17 రాష్టా నుంచి 55 మంది సభ్యు రాజ్యసభ పదవీకాం వచ్చే ఏప్రిల్‌ నెలో ముగియనుంది. ఈ క్రమంలో ఈసీ రాజ్యసభ స్థానా భర్తీ కోసం ఇటీవలే షెడ్యూల్‌ విడుద చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4 రాజ్యసభ స్థానాకు, తెంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి మహ్మద్‌ అలీ ఖాన్‌, టి. సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామక్ష్మి.. తెంగాణ నుంచి కేవీపీ రామచందర్‌ రావు, గరికపాటి మోహన్‌ రావు రాజ్యసభ పదవీకాం ఏప్రిల్‌ 9న ముగియనుంది.
తెంగాణలో రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేయనున్నారు అయితే ఈ సీట్ల కోసం ఇప్పటికే గులాబీ పార్టీలో ఆశావాహు లిస్ట్‌ పెరిగిపోయింది. ఇప్పటికే ఓ సీటుని కేసీఆర్‌ కుమార్తె కవితకు ఇవ్వనున్నారు అని వార్తు వినిపిస్తున్నాయి, మరో సీటు ఎవరికి అనేది చర్చ. రేసులో ఉన్నా నాయకు చూస్తే కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాున్నాయి. ఇక ఖమ్మం పార్టీ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి, అలాగే సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరావు, తుమ్మ నాగేశ్వరరావు, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య.
కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, గాదరి బామ్లు, సీతారాంనాయక్‌ .. హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి, అయితే వీరిలో కచ్చితంగా కవితకు ఓసీటు ఇస్తే మరో పదవి ఎవరికి ఇస్తారు అనేది చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కోటాలో జరగాల్సిన రాజ్యసభ సభ్యు ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ రేపు విడుద కానుంది. ఈ మేరకు ఏపీ ఎన్నిక ముఖ్య అధికారి కే విజయానంద్‌ ఒక ప్రకటన విడుదత చేశారు. కేంద్ర ఎన్నిక కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఆరో తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్‌ విడుద కానుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముప్పై వ తేదీ నాటికి రాజ్యసభ సభ్యు ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.  మొత్తం నుగురు సభ్యు ఎన్నికకు ఈ ఎన్నికు జరుగుతాయని ఒకవేళ నాుగుకు మించి నామినేషన్లు దాఖు అయితే పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. 26 వతేదీని పోలింగ్‌ తేదీగా ప్రకటించారు. అయితే..ఈ ఎన్నిక పోలింగ్‌ కు దారి తీసే అవకాశం లేనట్టే.
ఏపీ కోటాలో మొత్తం నాుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ నాుగూ మరో వాదన లేకుండా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతాయి. ప్రతిపక్ష తొగు దేశం పార్టీకి ఒక్క సీటు దక్కే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవం గానే ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానున్నట్టే. అయితే ఇంతకీ అధికార పార్టీ తరఫున ఆ నుగురు రాజ్యసభ సభ్యు ఎవరనేది ఆసక్తి దాయకంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో చాలా చాలా పేర్లు వినిపించాయి. నాుగు సీట్లకూ ఏడెనిమిది మంది నేత పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దే తుది నిర్ణయం అనే సంగతీ వేరే చెప్పనక్కర్లేదు పార్టీలోని ఆశావహు ఎన్ని ప్రయత్నాు చేసినా.. జగన్‌ నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది. ఉన్న ఖాళీు నాుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకా కూడికూ, తీసివేతు లెక్కలేసిన తర్వాత ఆ మూడిరట్లో ఇద్దరినీ ఫిక్సింగ్‌ చేసేశారు. ఇక మిగిలింది ఒక్కటే.. ఆ ఒక్కటీ ఇంటి అవసరా కోసం ఉంచుతారా? బడుగు వర్గాలో నిఖార్సయిన క్యాండిడేట్‌ దొరికితే ఇచ్చేస్తారా? చూద్దాం..ఎవరికిస్తారో..
 త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థు విషయంలో తుది నిర్ణయానికి వచ్చేసిందంట. రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాుగు సీట్లకు ఎన్నికు జరగబోతున్నాయి. ఈ నాుగు సీట్లు కూడా వైసీపీకే దక్కుతాయి. తమ పార్టీకి దక్కే నాుగు సీట్లను ఎవరికి కేటాయించానే దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తుది నిర్ణయానికి వచ్చేశారనే ప్రచారం మొదలైంది. పార్టీ శ్రేణు  ద్వారా అందిన సమాచారం ప్రకారం ఒక సీటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్యరామిరెడ్డికి దక్కుతుందంటున్నారు. ఆయన 2014 ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు.

మొదటి నుంచి వైసీపీకి గట్టి మద్దతుదారైన అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారట. అంతే కాకుండా ఆయన సోదరుడు  ఆర్కేకు మంత్రి పదవి ఇస్తామని, ఇవ్వలేకపోయినందున ఇప్పుడు రాజ్యసభ సీటిచ్చి ఆ కుటుంబానికి జగన్‌ న్యాయం చేస్తారని ఆ వర్గాు అంటున్నాయి. రెడ్డి వర్గం నుంచి పువురు రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నా ఈసారి మాత్రం అయోధ్యరామిరెడ్డికే ఆ సీటు దక్కుతుందని అంటున్నారు.  రాజ్యసభలో బీసీకు స్థానం కల్పించే యోచనలో జగన్‌ ఉన్నారు. అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీను మరింత దగ్గర చేర్చుకోవాంటే వారిలో ఒకరిని రాజ్యసభకు పంపడమే మంచిదని జగన్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ సీటు దక్కుతుందంటున్నారు. పార్టీలో చేరేటప్పుడే ఆయనకు హామీ ఇచ్చారంటున్నారు. అంతే కాకుండా పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న విజయసాయిరెడ్డికి ఆయన స్నేహితుడని, ఆర్థికంగా బవంతుడ్కెన బీదకు రాజ్యసభ సీటు ఖాయమని ఆయన సన్నిహిత వర్గాు చెప్పుకుంటున్నాయి.

శాసనమండలి రద్దయ్యే అవకాశాున్న నేపథ్యంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న బీసీ మంత్రు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ల్లో ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తారని ఇటీవ వరకు ప్రచారం జరిగినా.. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అది జరిగే వాతావరణం కనిపించడం లేదట. శాసనమండలి రద్దుకు కేంద్రం ఎంత వేగంగా నిర్ణయాు తీసుకున్నా  మరో ఆరేడు నెలు పడుతుందని, అప్పటి వరకు మోపిదేవి, పిల్లిను మంత్రుగా కొనసాగించి మరోసారి రాజ్యసభ సీటు ఇస్తారంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు తనకు రాజ్యసభ సీటు వస్తుందో.. రాదో అన్న ఆందోళనలో ఉన్న బీద ఇప్పుడు కొంత స్థిమితపడుతున్నట్లు తొస్తోంది.  
మరో సీటు బీజేపీ పెద్ద ఆశీస్సు ఉన్న పరిమళ్‌ నత్వానీకి ఖాయమైపోయిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై పరిమళ్‌ కూడా ఢల్లీిలో స్పందించారు. జగన్‌ను రాజ్యసభ సీటు గురించి అడిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇటీవ రియన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ… ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో ఇదే విషయంపై చర్చించారని, బీజేపీ పెద్దు ఇంతకు ముందే జగన్‌కు దీని గురించి చెప్పడంతో ఇక ఆయనకు సీటు భించడం లాంఛనమేనని అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నత్వానీ పోటీ చేస్తారని, ఆయనకు వైసీపీ మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అంబానీకి సన్నిహుతుడైన పరిమళ్‌.. జార?ండ్‌ నుంచి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్‌ 8వ తేదీతో ఆయన పదవీకాం పూర్తవుతుంది.

నాుగో  సీటు విషయంపై పార్టీలో చర్చోపచర్చు జరుగుతున్నాయట. ఒకటి ఓసీ, మరోటి బీసీ, ఇంకోటి రియన్స్‌ కోటాకు పోతే… మిగిలిన సీటు ఎస్సీ వర్గాకు ఇస్తారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే మహిళకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. పార్టీలో మహిళను ప్రోత్సహిస్తున్నారని, దాని ప్రకారం చూస్తే ఎస్సీ మహిళకు ఇస్తారని, అయితే రాజ్యసభకు పంపించగలిగిన అనుభవం ఉన్న మహిళ ఎవరనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోందట. ఎస్సీ అధికారుల్లో పార్టీకి విధేయంగా ఉన్న మహిళకు ఈ సీటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నాుగో అభ్యర్థి ఎవరో అన్న విషయం ఆఖరు నిమిషం వరకు తేకపోవచ్చునట. ఆ వర్గం నుంచి సమర్ధు భ్యం కాకపోతే మహిళా కోటాలో తన సోదరి షర్మికు అవకాశం ఇవ్వాని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం.  
పార్టీలో సీనియర్‌ నేతల్కెన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలో ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే వీరిద్దరికీ ఈసారి అవకాశం ఉండదంటున్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డికు గతంలో రాజ్యసభ ఇస్తామనే హామీతోనే ఎంపీ సీట్లు ఇవ్వలేదని, ఆ హామీని నిబెట్టుకోవాని వారి అనుచయి కోరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నెరవేరే సూచను కనిపించడం లేదని పార్టీ వర్గాు అంటున్నాయి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు ఇప్పటికే మంత్రిగా ఉన్నారని, ఇప్పుడు హడావుడిగా ఆయనకు రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీలో ఒక వర్గం నేతు అంటున్నారు. టీటీడీ చైర్మన్‌ పోస్టులో సుబ్బారెడ్డికి కూడా ఇప్పుడిప్పుడే రాజ్యసభ అవసరం లేని చెబుతున్నారు.