బిగ్‌బాస్ విజేతపై బీర్ బాటిళ్లతో దాడి
కేసు నమోదు: తాండూరు ఎమ్మెల్యే సోదరుడి హల్‌చల్
హైదరాబాద్: బిగ్‌బాస్-3 విజేత, గాయకుడు రాహుల్ సింప్లిగంజ్‌పై దాడి ఘటనలో కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. పబ్‌లో భించిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. రితేశ్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు రాహుల్‌పై బీరు సీసాతో దాడి చేశారని తెలిపారు. నృత్యం చేస్తున్న సమయంలో రాహుల్‌ను కొంతమంది తాకారు… దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకొందని వివరించారు. దాడి ఘటనపై రాహుల్ ఫిర్యాదు చేయలేదని, పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడి ఘటన అనుకోకుండా జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
పబ్‌లో ఏం జరిగిందంటే?
రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటప్పుడు వచ్చారు. కొంతమంది యువకు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్ వారిని నిదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాు పరస్పరం దాడుకు దిగాయి. ఒక దశలో యువకు రాహుల్‌ను బీరు సీసాతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడికి ప్పాడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాహుల్ చికిత్స పొందుతున్నారు.