సంక్షోభంలో సంక్షేమం

ప్రజను బద్దకస్తుగా మార్చేస్తున్న ప్రభుత్వ నిర్వీర్య పథకాు

`ఓట్లను రాబట్టే యంత్రాుగా మారిన సంక్షేమ పథకాు
`ఒకే కుటుంబంలో 3`4 మందికి ఉచిత పింఛన్లు
`పేదకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు
`రోజువారీ కూలి పనుకు సైతం వెళ్లని వైనం
`నిర్మాణ పను కోసం పొరుగు రాష్ట్రాపైనే ఆధారం
`సంక్షేమ పథకా కోసమే ఖర్చవుతున్న వే కోట్లు
`నత్తనడకన భారీ ప్రాజెక్టు పను
`సంక్షేమ భారం అంతా మళ్లీ వినియోగదారుపైనే
`భారీగా పన్ను విధింపుతో సామాన్యుపై భారం

హైదరాబాద్‌:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాు దాటింది. ఓట్ల ఆకలితో ఉన్న రాజకీయ నాయకు ఖజానాను క్లొగొట్టి ఉచిత పథకాను అందిస్తూ బద్ధకస్తు సమాజానికి తెరలేపుతున్నారు. రాజకీయ నాయకు గడచిన కొన్ని సంవత్సరా నుండి సంక్షేమ పథకా యొక్క అర్థాన్నే మార్చేస్తున్నారు. ఈ ఉచిత పథకాు నిజంగా ప్రజకు మేు చేకూరుస్తున్నాయా…? అంటే ముమ్మాటికీ కాదనే చెప్పాలి. అటు కేంద్ర ప్రభుత్వాు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాు అములోకి తెస్తున్న పథకాు భవిష్యత్తు తరాను కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్ను తలెత్తేలా చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు అము చేస్తున్న ఈ పథకాలే వృద్ధి రేటు పడిపోవటానికి, ఉత్పాదకత తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. నిజానికి సంక్షేమ పథకాు పేదకు అందుతున్నాయా అంటే నిజమైన పేదు కూడా కొన్ని చోట్ల ఆ సంక్షేమ పథకాకు అర్హుగా ఉండకపోవడం గమనార్హం.
ఎన్నికప్పుడు ఒకరు టీమీ ఇస్తామంటే.. మరొకు ల్యాప్‌ ట్యాప్‌ ఇస్తామంటారు. ఇవన్నీ అలా పెరుగుతూ పోతున్నాయి. కానీ ఇన్నాళ్లకీ.. గ్రామాల్లో మెరుగైన సౌకర్యాున్న ఓ స్కూల్‌ను నిర్మించగలిగామా..? ధనిక, పేద తేడా లేకుండా చదువుకునే స్కూళ్లను ఎందుకు నిర్వహించలేపోతున్నాం. ఇదేమైనా అసాధ్యమా..?. విదేశాల్లో అయితే.. ప్రభుత్వ స్కూళ్లలోనే అన్ని వర్గా ప్రజు చదువుకునే పరిస్థితు ఉంటాయి. నిజానికి చాలా ఏళ్ల కిందట ప్రభుత్వ స్కూళ్లలోనే జనరల్‌ మేనేజర్‌ కొడుకు, వాచ్‌ మెన్‌ కొడుకు కూడా చదువుకునేవారు. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదు..?
కొంతకాం క్రితం వరకు రాజకీయ పార్టీు విరాళాుగా సేకరించిన డబ్బు లేదా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోు చేసేవి. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సొమ్ము.. అంటే ప్రజు పన్ను రూపంలో కడుతున్న సొమ్మును సంక్షేమ పథకా పేరిట పంచుతూ ఓట్ల కొనుగోుకు తెరలేపాయి. ఎన్నికల్లో అల్పాదాయ వర్గా వారే అధికంగా ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎగువ మధ్య తరగతి, ఆపై వర్గావారు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఓటింగ్‌లో పాల్గొనేవారిని సంతృప్తిపరిస్తే చాు అన్న సూక్ష్మాన్ని రాజకీయ పార్టీు గుర్తించాయి. జనాకర్షక పథకాకు ఒకప్పుడు జాతీయపార్టీు దూరంగా ఉండేవి. ప్రాంతీయ పార్టీ ఆవిర్భావంతో జనాకర్షక పథకాు తెర మీదకు వచ్చాయి. దక్షిణాదిన తమిళనాడు, తొగు రాష్ట్రాు జనాకర్షక పథకా విషయంలో పోటీ పడుతూ ఉండేవి. ఆ తర్వాత ఈ జాబితాలోకి ఉత్తరప్రదేశ్‌ వచ్చి చేరింది. ఓటర్లకు అవి పంచుతాం, ఇవి పంచుతాం అంటూ అక్కడి ప్రాంతీయ పార్టీు పోటీ పడ్డాయి. ఇప్పుడు ఈ జాఢ్యం జాతీయ పార్టీకు కూడా పాకింది. ఫలితమే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన తాయిలాు! రాష్ట్రాలోనే కాకుండా దేశంలోనే ఇప్పుడు సంక్షేమం హద్దు మీరుతోంది.
 ప్రజకు మెరుగైన సౌకర్యా క్పనకు ఉపయోగపడాల్సిన పన్ను ఆదాయం పక్కదారి పడుతోంది. సంక్షేమం మితిమీరి సోమరిపోతు, తాగుబోతు పెరిగిపోతున్నారు. కష్టపడి పనిచేసే సంస్క ృతికి దూరం అవుతున్నారు. ఇప్పటివరకు మన దేశంలో మానవ వనరులే అతిపెద్ద అస్సెట్‌గా చెప్పుకొంటూ వచ్చాం. ప్రస్తుత సంక్షేమ పథకా వ్ల మానవ వనయి నిర్వీర్యం అవుతున్నాయి. అధికారం కోసం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీు.. ఇది ఎంత ప్రమాదకరమో, దేశానికి ఎంత ద్రోహం చేస్తున్నాయో ఆలోచించడం లేదు. సంక్షేమం పేరిట ప్రజను భిక్షగాళ్లుగా చేస్తున్న రాజకీయ నాయకు.. తమను తాము దానకర్ణుగా చెప్పుకొంటున్నారు. ఇలా ఎంత కాం? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించినా పర్వాలేదు.. ఎన్నికకు ముందు సంక్షేమం పేరిట కొత్త కొత్త పథకాు ప్రకటిస్తే చాు.. మళ్లీ అధికారంలోకి వస్తామన్న భావన రాజకీయ పార్టీల్లో ఏర్పడటం ఎంత ప్రమాదకరం? దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అంగీకరించే రాజకీయ పార్టీు శాశ్వత పరిష్కారా గురించి మాత్రం ఆలోచించడం లేదు. పెట్టుబడి సాయం పేరిట కొత్త పథకాకు శ్రీకారం చుడుతున్నాయి.
 వ్యవసాయం లాభసాటి కానంతవరకు ఎన్ని పథకాు ప్రవేశపెట్టినా వ్యర్థమే! తొగు రాష్ట్రా విషయమే తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వాు అముచేస్తున్న సంక్షేమ పథకా పుణ్యమా అంటూ గ్రామాల్లో వ్యవసాయ పనుకు కూలీు దొరకడం లేదు. దీనికితోడు ఉపాధి హామీ పథకం ఒకటి! ఫలితంగా బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రా నుంచి వ్యవసాయ కూలీను పిలిపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరది. తొగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులో పనిచేస్తున్న వారిలో 90 శాతం వరకు ఇతర రాష్ట్రా వారే కనిపిస్తున్నారు. సంక్షేమం పేరిట పనిచేయాల్సిన అవసరం లేకుండా చేయడమే ఇందుకు కారణం! 30 ఏళ్ల క్రితం రెండు రూపాయకు కిలో బియ్యం పథకాన్ని అముచేసిన ఎన్‌టీఆర్‌ను ప్రజు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు తొగునాట రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నారు. అయినా బియ్యం ధరను రూపాయికి తగ్గించిన ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తుచుకుంటున్నవారు లేరు.
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటారు కానీ, కడుపు నిండినవాడికి ఇంకా ఇంకా పెట్టినా పట్టించుకోరు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయినా అధికారంలో ఉంటున్నవారు పట్టించుకోవడం లేదు. దీనివ్ల కూలీ కొరత తీరడమే కాకుండా రైతుకు కూలీపై చేసే ఖర్చు ఎకరానికి నాుగైదు వే రూపాయ వరకు ఆదా అవుతాయి. అయినా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయరు. ఆ పని చేయకుండా పెట్టుబడి సాయమంటూ రైతును కూడా మభ్యపెట్టి ఓట్లు క్లొగొట్టే పనిలో పడ్డారు. తెంగాణలో గత ఎన్నిక సందర్భంగా రైతు బంధు రెండో విడత సహాయాన్ని పోలింగ్‌కు నాుగైదు రోజు ముందు రైతు ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఆనందించిన రైతు కృతజ్ఞతగా కేసీఆర్‌ను దీవించారు. ఇది గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పరిమిత స్థాయిలో ఈ పథకాన్ని అముచేసి ఓట్లు క్లొగొట్టాని పథకం వేసుకున్నారు. ముగిసిపోతున్న ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడంలోనే కేంద్ర పెద్ద కపటత్వం బయటపడుతోంది.  
ఒకరిని మించి ఒకరు!
రైతు బంధు వంటి సంక్షేమ పథకాు అము చేయడం ద్వారా తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిక్సూచిగా మారారని టీఆర్‌ఎస్‌ నాయకు పొగుడుకుంటున్నారు కానీ, ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోు చేసే కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అడిగిన వారందరికీ త్లెకార్డు ఇవ్వడం వంటి చర్య ద్వారా 2009 ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి బ్ధి పొందారు. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి నడక మొదలెట్టగా.. తెంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు దౌడు తీస్తున్నారు. దీంతో ఇతయి కూడా పరుగు ంకించుకున్నారు. రాజశేఖర్‌రెడ్డిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్‌ ఓట్ల కొనుగోు పథకాను మరింత విస్త ృతపరిచారు. ఓటుకు నోటు కేసు సంగతి ఏమిటో తెలియదు కాని, ప్రభుత్వాలే ఇప్పుడు ఓటుకు నోటు స్కీమ్‌ను అధికారికంగా అముచేస్తున్నాయి.
తెంగాణలో గొర్రొ పంచిపెట్టడం, బతుకమ్మ చీరు పందేరం చేయడం వంటివి చేసిన కేసీఆర్‌, సరికొత్త అస్త్రంగా రైతుబంధు పేరిట ఎకరాకు ఏడాదికి ఎనిమిది వే రూపాయు పంచి పెట్టారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని పది వేకు పెంచారు.
ఏదైతేనేమి స్కీమ్‌ వర్కవుట్‌ అయింది. ఓట్ల పంట పుష్కంగా పండిరది. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. రెండొంద రూపాయు మివ చేసే బతుకమ్మ చీర కోసం రెండొందకు పైగా భించే కూలీ వదుకుని మహిళు క్యూ కట్టడాన్ని మనం చూస్తున్నాం. పాకుకు ఈ సైకాజీ బాగా నచ్చింది. అంతే తమ మేధస్సుకు పదునుపెట్టి సరికొత్త సంక్షేమ పథకాకు శ్రీకారం చుడుతున్నారు. ఇవన్నీ చావన్నట్లు అధికారంలో ఉన్నవారు కమీషన్ల రూపంలో భించే సొమ్ముతో ఎన్నికల్లో వే కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి ఇది కూడా ప్రజ సొమ్మే! సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెబుతున్న తెంగాణ ప్రభుత్వం మౌలిక వసతు విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా ఉన్నామని చెప్పుకోగదా? కనీస వసతు లేని ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రులో చోటుచేసుకుంటున్న దీనగాథను మనం వింటూనే ఉన్నాం.
విద్య, వైద్య రంగాను ప్రభుత్వాు గాలికి వదిలేశాయి. ఈ రెండు రంగాను ప్రైవేట్‌ రంగానికి వదిలేసి ఉన్న డబ్బుతో సంక్షేమం పేరిట ఓట్ల కొనుగోుకు పాకు తెగబడుతున్నారు. ధనిక రాష్ట్రమైన తెంగాణలో ప్రధాన ఆస్పత్రు స్థితిగతులో మార్పు రాలేదు. ప్రాథమిక ఆరోగ్యం పరిస్థితి చెప్పనవసరం లేదు. విశ్వవిద్యాయాలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాయం అధ్యాపక సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ అవసరా కోసం మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాయాు అనాథుగానే ఉన్నాయి. తెంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే కేసీఆర్‌, కేటీఆర్‌ విశ్వవిద్యాయా అస్తిత్వం గురించి మాత్రం మాట్లాడరు. ఎందుకంటే అధ్యాపకును నియమించి వసతు మెరుగుపరిచినా ఓట్లు రావు. ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్‌ అనుసరించిన మోడల్‌ దెబ్బతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా సంక్షేమ పథకా ప్రకటనలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో సంక్షేమం పేరిట రాజకీయపార్టీు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందున పార్టీను దారిలో పెట్టే బాధ్యతను సమాజమే తీసుకోవాలి. ఇందులో భాగంగా హద్దు దాటుతున్న సంక్షేమ పథకాు ప్రకటిస్తున్న రాజకీయపార్టీను నిదీయాలి. ఎవడబ్బ సొమ్మని పంచిపెడుతున్నారు? అని ప్రశ్నించాలి. మేం కష్టపడి సంపాదించి కడుతున్న పన్నును మీ ఇష్టమొచ్చినట్లు పంచిపెట్టే అధికారం మీకు ఎక్కడిది? అని నినదించాలి. అదే సమయంలో ఇప్పటివరకు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నవారు ఇకపై విధిగా ఓటింగ్‌లో పాల్గొని హద్దు దాటుతున్న రాజకీయ పార్టీకు బుద్ధి చెప్పాలి. సంక్షేమం కూడా వికటించే ప్రమాదం ఉందన్న భయం రాజకీయ పార్టీల్లో ఏర్పడకపోతే ఈ సంతర్పణ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.