అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు

కారులో 3 మృతదేహాు భ్యం: దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందం

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో గ్రామ సర్పంచి భర్త, కుమారుడు, డ్రైవర్‌ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… సర్నేనిగూడెం గ్రామ సర్పంచి రాణి భర్త మధు, కుమారుడు మత్స్యగిరి, డ్రైవర్‌ సాగుబావిగూడేనికి చెందిన శ్రీధర్‌రెడ్డి సమీప గ్రామానికి కారులో వెళ్లి వస్తుండగా… శుక్రవారం రాత్రి ఎ్లంకి చెరువు కట్టపై వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గరూ అందులోనే ఇరుక్కుపోయారు.
ఎంతకూ వీరు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యు శుక్రవారం రాత్రి పోలీసుకు ఫిర్యాదు చేశారు.  రాత్రి నుంచి వీరికోసం కుటుంబ సభ్యు, పోలీసు గాలింపు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసు ఎ్లంకి గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన దశ్యాను పరిశీలించి.. కారు చెరువు కట్టపైకి వెళ్లినట్టు గర్తించారు. శనివారం మధ్యాహ్నం ఎ్లంకి చెరువులోంచి కారుతో సహా 3 మృతదేహాను బయటకు తీశారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.