సామాజిక న్యాయం కోసం పోరాడతాం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్: ఎన్నికు ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్లు, రాజకీయ బ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు సముచిత న్యాయం జరగాన్నారు. గిరిజను, ముస్లిం రిజర్వేషన్లపై తెరాస ఎంపీు ఒక్కసారి కూడా పార్లమెంట్‌లో మాట్లాడిన దాఖలాు లేవని ఉత్తమ్ ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో గిరిజను రిజర్వేషన్లు 5శాతం నుంచి 6 శాతానికి పెంచినపుడు ఎలాంటి కమిషన్ వేయలేదని.. కేవం జీవో ద్వారా జనాభా ప్రాతిపదికన దాన్ని అము చేశారని ఆయన గుర్తు చేశారు. తెంగాణలో జనాభా ప్రాతిపదికన గిరిజను రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు. దళితుడైన దామోదరం సంజీవయ్యను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. తెంగాణలో అతిపెద్దదైన మాదిగ సామాజికవర్గం నుంచి ఒక్కరికి కూడా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు. దీన్ని యావత్ తెంగాణ సమాజం ఖండిరచాన్నారు.