రోడ్లను నిర్బంధించడం సరికాదు

షహీన్‌బాగ్‌ నిరసనకారునుద్దేశించి సుప్రీం వ్యాఖ్యు

న్యూఢల్లీి: నిరసన తెలియజేయడం ప్రజ ప్రాథమిక హక్కే అయినప్పటికీ రోడ్లను నిర్బంధించడం అనేది ఆందోళనకర అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సమతూకం అవసరమని షహీన్‌బాగ్‌ నిరసనకారునుద్దేశించి వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ దిల్లీలోని షహీన్‌ బాగ్‌లో గత రెండు నెలుగా కొందరు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ మార్గంలో రాకపోకు నిలిచిపోయాయి. ఇలా నిరసన పేరుతో రోడ్లను నిర్బంధించడంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అభిప్రాయాను వ్యక్తీకరించడంపై ప్రజాస్వామ్యం పనిచేస్తుందని, అయితే, అందుకు కొన్ని హద్దుంటాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. షహీన్‌ నిరసనకారుతో మాట్లాడేందుకు మధ్యవర్తుగా సీనియర్‌ న్యాయవాదు సంజయ్‌ హెగ్డే, సాధన రామచంద్రన్‌ను నియమించింది. ప్రజకు ఎలాంటి ఇబ్బంది కగని చోట నిరసన తెలిపేలా నిరసనకారును ఒప్పించాని సూచించింది. ఒకవేళ ఫలితం లేకుంటే నిర్ణయాధికారం అధికారుకే వదిలేస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.