సురక్షిత ప్రయాణానికి చర్యు

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ సూచను

న్యూఢల్లీి: ద్విచక్ర వాహనాల్లో ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యు చేపట్టింది. బైక్‌పై వెనకవైపు కూర్చున్న మహిళ చీర, చున్నీ వంటివి చక్రాల్లోకి వెళ్లిపోయి ప్రమాదాకు కారణమవుతున్న దృష్ట్యా కొన్ని మార్పు తీసుకురావాని నిర్ణయించింది. వెనక చక్రంలో కనీసం సగ భాగాన్ని కప్పి ఉంచేలా వాహన తయారీదాయి ఏర్పాట్లు చేయాని, ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ లోగా ఇది అము జరగాని ఆదేశించింది. వెనక వైపు కూర్చున్నవారు పట్టుకునేందుకు మీగా వాహనానికి పక్కన గానీ, డ్రైవరు సీటుకు వెనక గానీ ఒక హ్యాండిల్‌ తప్పనిసరిగా బిగించాని, పాదాన్ని ఆన్చడానికి తగిన ఏర్పాట్లూ చేయాని మంత్రిత్వశాఖ ఆదేశించింది.
 ఆన్‌లైన్‌ ఆర్డర్లపై హోటళ్ల నుంచి ఆహార పొట్లాు తెచ్చేవారు తమకు నచ్చిన రీతిలో ద్విచక్ర వాహనా వెనకవైపు పెట్టెల్ని బిగించుకుంటున్నారు. ఇకపై దీనికీ కళ్లెం పడనుంది. వీటి ఎత్తు 50 సెం.మీ, వెడ్పు 51 సెం.మీ, పొడవు 55 సెం.మీ. లోపు ఉండాలి. పెట్టె, దానిలో ఉండే పార్శిళ్ల బరువు కలిపి 30 కిలోు మించకూడదు.
వ్యవసాయ ట్రాక్టర్లు, నిర్మాణ సామగ్రి సంబంధిత వాహనాల్లో డ్రైవర్లకు క్యాబిన్‌, దానికి ఒక కిటికీ ఉండాలి. ఇవన్నీ అక్టోబరు నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.