ఏమి సేతురా లింగా? జనసేనానికి దారేది?
బీజేపీ ద్వంద్వ పరిణామాతో కకావికు
`ఏపీ రాజకీయాతో కమనాధు డబుల్ గేమ్
`కేంద్రంలో జగన్‌తో రాష్ట్రంలో పవన్‌తో మంతనాు
`మూడు రాజధానుపై ఏపీలో పవన్ పోరాటం
`రాజధానుపై జగన్‌కు సానుకూం
`ఢల్లీి ఓటమితో బీజేపీలో వచ్చిన మార్పు
`ప్రాంతీయ పార్టీతో ఇకపై సానుకూ ధోరణి
`పార్టీని ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పవన్
`వైసీపీతో ఎలా నడుచుకోవాలో అని డైమాలో పవన్
హైదరాబాద్:
కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఏపీలో డబుల్ గేమ్ అడుతోందా? పరిణామాు, ఊహాగానాు నిజమే అయితే ఏపీలో బీజేపీ ఆడేది ఖచ్చితంగా డబుల్ గేమ్ అంటున్నారు రాజకీయ పరిశీకు. వచ్చే అయిదేళ్ళలో ఏపీలో అధికారంలో భాగస్వాముయ్యేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుల్లో ఓ పక్క వైసీపీతోను, ఇంకోపక్క జనసేనతోను పక్కా వ్యూహంలో బీజేపీ ముందుకు వెళుతుందంటున్నారు రాజకీయ పరిశీకు. బీజేపీతో కలిసి తప్పుచేశామనే భావన ఇప్పుడు జనసేనానికే కాదు ఆ పార్టీ అభిమానును సైతం కుగుతోంది. పవన్ కళ్యాణ్‌కు ప్రస్తుత రాజకీయాు మింగుడుపడటం లేదు. ఇటు ఏపీలో ఏ సమస్యపై పోరాడాలో కూడా అంతుపట్టని పరిస్థితిలో పవన్ డోలాయమానంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాు రసవత్తరంగా సాగుతున్నాయి. అసు ఎవరు ఎవరితో జత కడుతున్నారో అర్ధంకాని పరిస్థితి నెకొంటుంది. ముఖ్యంగా బీజేపీ-జనసేన… బీజేపీ-వైసీపీ మధ్య సంబంధాల్లో పరస్పర విరుద్ధ భావజాం కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనతో కలిసి కాపురం చేస్తోన్న బీజేపీ…. కేంద్రానికి వచ్చేసరికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. స్టేట్ లో కొట్టుకుంటున్న బీజేపీ, వైసీపీు… ఢల్లీిలో మాత్రం ఒకరికొకరు స్నేహహస్తం చాచుకుంటున్నారు. ఇదే, ఇప్పుడు జనసేనానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది. కలిసి పని చేయాని, జగన్ ప్రభుత్వంపై ఉద్యమించాని, జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకున్నాయి. కానీ ఇంతవరకూ ఉమ్మడి ఉద్యమం పట్టాలెక్కలేదు. మరోవైపు, బీజేపీ అధిష్టానం మాత్రం, సీఎం జగన్‌తోనూ, వైసీపీ ఎంపీతోనూ క్లోజ్‌గా మూవ్ కావడం, వరుసగా జగన్ ఢల్లీి పర్యటను, జనసేన అధినేతలో అనుమానపు బీజాు నాటుతున్నాయంటున్నారు. జగన్ అదేపనిగా ఢల్లీికి వెళ్లడం …ప్రధాని మోడీ అండ్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవడాన్ని పవన్ సహించలేకపోతున్నారట. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై పోరాడదామంటూనే, మరోవైపు అదే జగన్‌తో క్లోజ్‌గా మూవ్ అవడం అస్సు అర్థంకావడం లేదని సేనాని అంటున్నారట. అయితే, పవన్‌ను బీజేపీ ఆటలో అరటి పండు చేస్తోందని జనసేన సీనియర్లు లోలోప రగిలిపోతున్నారట. దాంతో, అసు ముందుముందు సంసార నావ సాగుతుందా…నడి సంద్రంలో మునిగిపోతుందా అన్న అనుమానాు కూడా వ్యక్తమవుతున్నాయి.
2019 ఎన్నికల్లో ఏపీలో కనీసం బోణీ కొట్టలేకపోయిన బీజేపీ.. ఆ తర్వాత అటు వైసీపీతోను, ఇటు జనసేనతోను సమాన దూరం పాటిస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలో బీజేపీ, జనసేన దోస్తీ కుదిరింది. జనవరి మూడో వారంలో బీజేపీ, జనసేన మిత్రపక్షాయ్యాయి. 2024 ఎన్నికలే క్ష్యంగా రెండు పార్టీు పని చేస్తాయని ఇరు పార్టీ నేతు ప్రకటించారు. ఇది జరిగి ఇంకా నె రోజు కూడా పూర్తి కాలేదు.
అంతలోనే బీజేపీ మరో వ్యూహానికి తెరలేపింది. వైసీపీని దగ్గర చేసుకునేందుకు కొన్నాళ్ళ నుంచి విఫయత్నం చేస్తూ వస్తున్న కమనాథు.. తాజాగా ఏపీలో తలెత్తిన పరిణామా నేపథ్యంలో చక్రం తిప్పుతున్నారు. ఏపీలో ఇపుడు అత్యంత అవసరంగా మండలి రద్దు జరగాల్సిన అవసరం వుంది. మండలి రద్దైతే గానీ మూడు రాజధాను ప్రతిపాదనలో అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. దాంతో మంతనాకొచ్చిన వైసీపీ అధినేత జగన్ ముంగిట ఎన్డీయేలో చేరాన్న ప్రతిపాదన పెట్టినట్లు తొస్తోంది. ఎన్డీయేలో చేరితే కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడమే కాకుండా.. భవిష్యత్తులో జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నది బీజేపీ ప్రతిపాదన. స్వయంగా నరేంద్ర మోదీ ఈ ప్రతిపాదన చేయడంతో కాదన లేని పరిస్థితి జగన్‌కు ఉత్పన్నమైందని అంటున్నారు. ఈ భేటీ జరిగిన రెండో రోజే మరోసారి జగన్‌ను ఢల్లీి వచ్చి, అమిత్ షాను కల్వాల్సిందిగా బీజేపీ నేతు కోరడంతో వైసీపీని చేర్చుకోవడంలో కమనాథు దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా స్పష్టమయింది.
ప్రస్తుత రాజకీయ అవసరా కోసం జగన్ కేంద్ర కేబినెట్‌లో చేరితే.. మరి ఇదివరకే జత కట్టిన జనసేన పరిస్థితి ఏంటి ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి ప్రత్యామ్నాయ కూటమిగా 2024 నాటికి ఎదుగుతామని ప్రకటించిన జనసేనాని.. రేపు బీజేపీ, వైసీపీతో జత కడితే ఏం చేస్తారన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ఓ వైపు జనసేనను ఆల్‌రెడీ ఎన్డీయేలో కుపుకున్న బీజేపీ.. వైసీపీని లాగేస్తే.. అది ఏపీలో తొగుదేశం, కాంగ్రెస్ పార్టీకు కలిసి వచ్చే అంశంగా మారుతుందన్నది రాజకీయ విశ్లేషకు అంఛనా. బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదంటున్నారు. సొంత జిల్లా అయినా కూడా ఇక్కడ జనసేనానిని ఆదరించలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి పాక్లొు నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. అక్కడ నుంచే తన విజయ ప్రస్థానం మొదు పెట్టానుకున్న జనసేనాని… భీమవరం నుంచి పోటీ చేసినా ఫలితం మారలేదు. తన రెండో అన్నయ్య నాగబాబును కూడా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆయన కూడా ఓటమి పాయ్యారు. అలా ముగ్గురు అన్నదమ్ముకు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదని అనుకుంటున్నారు.
జనసేనాని పవన్‌కు ఉన్న ఆదరణ చూసి 2019 ఎన్నికల్లో కచ్చితంగా గొస్తామని టీడీపీ, వైసీపీ నుంచి కూడా జనసేనలోకి చాలా మంది చేరారు. కానీ జిల్లాలో జనసేనాని పాచిక పారలేదు. పవన్ కళ్యాణ్, నాగబాబు సహా జిల్లాలో అన్ని నియోజకవర్గా అభ్యర్థు ఓడిపోయారు. ఎన్నిక తర్వాత పార్టీ కార్యక్రమాు జిల్లాలో పెద్దగా లేకపోవడంతో నాయకుంతా సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు జనసేన నాయకుకు, కార్యకర్తకు అసు సమస్య వచ్చిపడిరదంటున్నారు. కనీసం పార్టీ నాయకుకు సమాచారం ఇవ్వకుండా, కార్యకర్త అభిప్రాయం తొసుకోకుండా బీజేపీతో జనసేనాని పొత్తు పెట్టుకోవడంతో తలు పట్టుకుంటున్నారట. టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, పాక్లొు వైసీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు, ఏూరు కార్మిక నాయకుడు రెడ్డి అప్పనాయుడు, తణుకు నుంచి పసుపులేటి వెంకట రామారావు లాంటి వాళ్లు ఇప్పుడు ఏమి చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారట. టీడీపీ, వైసీపీలో ఉన్నప్పుడు కార్యకర్తల్లో, పార్టీ నాయకుల్లో కనీసం మర్యాద అయినా ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరు పకరించే నాయకుడు లేరంటూ సన్నిహితు దగ్గర ఫీవుతున్నారట.
తాడేపల్లిగూడెం టీడీపీలో ఒక మెగు వెలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారిందట. ఈ పొత్తుతో ఇప్పుడు బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యారావుతో కలిసి ఎలా పని చేయాని తమ వారి దగ్గర వాపోతున్నారట. ఇలా కలిసి పనిచేస్తే రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆయన ఒక్కరే కాదు జిల్లాలో పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుని జనసేనలోకి వచ్చి ఎన్నో డబ్బు ఖర్చు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థు ఇప్పుడు బీజేపీతో కలిసి పని చేయడానికి రెడీగా లేరని కార్యకర్తు గుసగుసలాడుకుంటున్నారు. జనసేనాని బీజేపీతో పొత్తుకు వెళ్లే ముందు పార్టీ కింది స్థాయి నాయకుకు కూడా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఎటు వైపు వెళ్తుందో అర్థం కాక మధనపడుతున్నారు. వచ్చే ఎన్నిక మాట పక్కన పెడితే అసు త్వరలో జరిగే స్థానిక ఎన్నిక వరకు అయినా పార్టీలో ఉందామా? సొంత పార్టీ గూటికి తిరిగి వెళ్లిపోదామా అని జిల్లాలోని జనసేన నాయకు ఆలోచిస్తున్నారంట. మరి ఈ విషయంలో జనసేనాని వారికి ఏమైనా భరోసా ఇచ్చేందుకు చర్చిస్తారా.. లేకపోతే ఇలానే వదిలేస్తారా.. అని జనాు అనుకుంటున్నారు.