ఓల్డ్‌సిటీకి మెట్రో రాకుండా మజ్లిస్ కుట్రు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్: మెట్రో రౖుె సేవపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో రౖుె అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతాధికారుతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ఉన్నతాధికాయి హాజరయ్యారు. అయితే మెట్రో రౖుె ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా జేబీఎస్ మెట్రో స్టేషన్‌ను కిషన్‌రెడ్డి సందర్శించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో ఆయన ప్రయాణించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మెట్రోకు రవాణా వ్యవస్థను అనుసంధానించాలి. ఈ విషయమై మెట్రో, ఆర్టీసీ అధికారుతో మాట్లాడతా. మెట్రోకు రూ.1458 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే కేంద్రం రూ.1200 కోట్లను ఎల్‌అండ్‌టీకి ఇచ్చింది. మెట్రో రౖుె వస్తే పాత నగర రూపురేఖు మారిపోతాయి. పాత నగరానికి మెట్రో రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుకుంటోంది. మజ్లిస్ కుట్రను ప్రజు అర్థం చేసుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
‘‘మెట్రోకు సమాంతరంగా ఎంఎంటీఎస్ ఫేజ్-2 పూర్తి చేయాలి. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కేంద్ర వాటా కంటే అదనపు నిధుతో ఎంఎంటీఎస్ పను జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే ఎంఎంటీఎస్ సేమ ప్రజకు అందుబాటులోకి వస్తాయి’ అని చెప్పారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ నగరంలో పేదవారికి ఇళ్ల సౌకర్యం, వైద్య సౌకర్యం అందడం లేదో మంత్రి కేటీఆర్ చెప్పాన్నారు. అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే ఏకైక అజెండాగా కేటీఆర్ పెట్టుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.