అత్యాచార, లైంగికదాడి కేసులో11 మందికి జీవిత ఖైదు
ముజఫర్‌పూర్ వసతి గృహం కేసులో ప్రధాన దోషికి శిక్ష ఖరారుచేసిన ఢల్లీి హైకోర్టు
న్యూఢల్లీి: ముజఫర్‌పూర్ వసతి గృహం కేసులో దోషిగా తేలిన బ్రజేశ్ ఠాకూర్‌కు ఢల్లీి కోర్టు శిక్ష ఖరారు చేసింది. అతడు సహజ మరణం పొందే వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు మెవరించింది. ఈ కేసులో దోషుగా తేలిన మరో 18 మందిలో 11 మందికి కూడా జీవిత ఖైదు విధించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహంలోని బాలికపై లైంగిక దాడి, అత్యాచారం కేసులో ఠాకూర్ ప్రధాన దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడితో పాటు మరో 18 మందిని న్యాయస్థానం దోషుగా తేల్చింది. ఈ కేసులో ఆరోపణు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని గతంలోనే నిర్దోషిగా ప్రకటించింది. ముజఫర్‌పూర్‌లో బిహార్ పీపుల్స్ పార్టీ(బీపీపీ)కి చెందిన బ్రజేశ్ ఠాకూర్ ఈ వసతి గ ృహాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో ఉంటున్న దాదాపు 42 మంది బాలికపై లైంగిక దాడికి ప్పాడటంతో పాటు వారిపై అత్యాచారాు జరిగినట్లు మెగులోకి వచ్చింది. 2018, మే 26న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బయటపెట్టిన నివేదిక ద్వారా ఈ దారుణాు మెగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇవి సంచనం స ృష్టించాయి. 42 మంది బాలికల్లో 34 మందిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసు వసతి గృహ నిర్వాహకు బ్రజేశ్ ఠాకూర్‌తో పాటు మరో 20 మందిని నిందితుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఎనిమిది మంది మహిళు కాగా, 12 మంది పురుషు ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా తర్వాత దీన్ని సీబీఐకి అప్పగించారు. వసతి గృహంలోని బాలికకు మత్తు మందు ఇచ్చి వారితో అసభ్యకర పాటకు నృత్యం చేయించినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.