ఆ చట్టానికి సుప్రీం సమర్థన

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి మద్దతు

న్యూఢల్లీి: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం-2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణ నిరూపణ కాని పక్షంలోనే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయానిస్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్లెడిరచింది. సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారు అనుమతికూడా అవసరం లేదని తేల్చింది.  మరోవైపు ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర భట్‌ మాట్లాడుతూ.. ఒకవేళ ప్రాథమిక విచారణలో ఆరోపణ నిరూపణ కాని నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేసే అవకాశం ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణ నేపథ్యంలో సుప్రీంకోర్టు పు నిబంధనల్ని సడలిస్తూ 2018మార్చి 20న తీర్పు మెవరించింది. దీంతో చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందంటూ దేశవ్యాప్తంగా నిరసను మ్లెవెత్తాయి. తీర్పుపై సమీక్ష కోరుతూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీంతో దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మార్చి 20 నాటి మార్గదర్శకానినిుపుద చేస్తూ అక్టోబరు 1, 2019న తీర్పు మెవరించింది. మరోవైపు మార్చి 20 నాటి సుప్రీం మార్గదర్శకాను నీరుగారుస్తూ కేంద్రం చట్టానికి సవరణు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ పువురు సుప్రీంను ఆశ్రయించారు. కేంద్ర సవరణు పౌరు వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్‌ పృథ్విరాజ్‌ చౌహాన్‌ వాదించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఎస్టీ, ఎస్టీపైవివక్ష ఇంకా కొనసాగుతోందని.. ఈ నేపథ్యంలో కఠిన నిబంధనల్ని సడలించలేమని స్పష్టం చేసింది.నాటి తీర్పులో ఏముంది…
ఈ చట్టం కింద ఏ వ్యక్తి పైనైనా కేసు నమోదైతే ఏడు రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి. ప్రాథమిక దర్యాప్తు జరిగినా, కేసు నమోదైనా నిందితుడి అరెస్టు అనివార్యం కాదు.  నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతడిని అరెస్టు చేయడానికి అతడిని ఉద్యోగంలో నియమించిన వ్యక్తి అనుమతి తప్పనిసరి. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే అరెస్టు చేయడానికి ఎస్‌ఎస్‌పీ స్థాయి అధికారిఆమోదం తప్పనిసరి.
ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్‌-18 ప్రకారం ముందస్తు బెయిుకు మీ లేదు. కోర్టు తన ఆదేశంలో ముందస్తు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చట్టం కింద పెట్టిన కేసుదురుద్దేశపూరితంగా పెట్టిందని తేలితే ముందస్తు బెయిల్‌కు మీ ఉంటుంది.