విద్యుత్ ఛార్జీ పెంపు
కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించిన ఏపీఈఆర్‌సీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) సోమవారం కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. 500 యూనిట్లలోపు గృహవినియోగదారుకు టారిఫ్ రేట్లను పెంచలేదు. 500యూనిట్లకు పైబడిన వారికి యూనిట్ ధరను రూ.9.05నుంచి 9.95కు పెంచింది. ప్రతి నెకు ఆ నెలోని విద్యుత్ వినియోగంపైనే ఈ వర్గీకరణ ఉండేందుకు ఏపీఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకుగాను రూ.8,353.58 కోట్లను విద్యుత్ సంస్థకు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ సబ్సిడీపెరిగింది. సబ్సిడీ పెంచడంతో అదనంగా 18 క్ష మంది వ్యవసాయదారుకు బ్ది చేకూరనుంది. 500 యూనిట్లలోపు గృహ వినియోగదారుకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా కోసం రూ.1707.07కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థకు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.