కోలీవుడ్‌లో ఐటీ కకం
హీరో విజయ్‌ని ప్రశ్నించిన ఇన్ కంటాక్స్ అధికాయి..లెక్కు చూపని నిర్మాతు
మూడు రోజుగా కొనసాగుతున్న ఐటీ దాడు కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. నిన్నటి వరకు అకరమాస్తు విషయాల్లో హీరో విజయ్ ని ప్రశ్నించిన ఇన్ కంటాక్స్ అధికాయి ఆయన సన్నిహితుడు, విజిల్ చిత్ర నిర్మాత అన్బు చెలియన్ నివాసాల్లో సోదాు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు నూ. 77కోట్ల అక్రమాస్తును గుర్తించిన అధికాయి.. మరో 300కోట్ల మివైన ఆస్తు పత్రాను స్వాధీనం చేసుకున్నారు. మధురైలో కార్యాయాు, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ హౌజ్ తో పాటు 20ప్రాంతాల్లో ఏకకాంలో దాడు కొనసాగుతున్నాయి.
ఏజీఎస్ సంస్థ అధిపతి కల్పాత్తి అఘోరా చెన్నై తేనాంపేటలో సంస్థ ప్రధాన కార్యాయం ఏర్పాటు చేసుకుని సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు సినిమా ఫైనాన్స్ చేస్తున్నట్లు తొస్తోంది. 2006 నుంచి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఏజీఎస్ సంస్థ ఇప్పటి వరకు 20 చిత్రాు నిర్మించింది. రూ.180 కోట్లతో విజయ్ హీరోగా నిర్మించిన బిగిల్ చిత్రాన్ని గత ఏడాది దీపావళి సమయంలో విడుద చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి రూ.200 కోట్ల లాభాను ఆర్జించింది. బిగిల్ చిత్రం వసూళ్లలో జాతీయ స్థాయిలో టాప్ 10లో స్థానాన్ని దక్కించకున్నట్లు నిర్మాత కల్పాత్తి అఘోరా కుమార్తె అర్చన తన ట్విట్టర్‌లో పెట్టారు.
ఐటీ రిటర్న్స్ దాఖులో అనుమానాు
ఏజీఎస్ సంస్థ ఐటీ రిటర్న్స్ దాఖులో బిగిల్ చిత్రానికి విజయ్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను పొందుపరిచారు. విజయ్ దాఖు చేసిన ఐటీ రిటర్న్‌కు సంస్థ చూపిన లెక్కకు పొంతనలేదని అధికాయి భావించినట్లు తొస్తోంది. దొంగలెక్క ద్వారా తక్కువ ఆదాయం చూపుతూ కోట్లాది రూపాయా పన్ను ఎగవేసిన అభియోగంపై విజయ్, రాష్ట్రంలోని పు ప్రాంతాల్లో ఉన్న సినీ ఫైనాన్షియర్, ఏజీఎస్ నిర్మాణ సంస్థ అధినేత అన్బుసెళియన్ ఇళ్లు, కార్యాయాు, ఏజీఎస్ సినిమా థియేటర్లు సహా 38 చోట్ల బుధవారం ప్రారంభమైన ఐటీశాఖ తనిఖీు గురువారం కూడా కొనసాగాయి. ఒక్క అన్బుసెళియన్ ఇు్ల, కార్యాయంలోనే రూ.77 కోట్ల నగదు, రూ.24 కోట్ల మివైన కిలో వజ్రాు, డైమండ్‌రాళ్లు, బంగారంతోపాటు రూ.300 కోట్ల మివైన స్థిరాస్థిపత్రాు పట్టుబడినట్లు సమాచారం. కట్టు కట్టుగా కరెన్సీని కుక్కి ఉన్న అనేక జిప్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో వినియోగించే ఆటోమేటిక్ మెషిన్‌ను తెప్పించి నగదును లెక్కించారు.
చెన్నై పనయూరు, సాలిగ్రామంలో విజయ్ ఇళ్లు, కార్యాయాల్లో తనిఖీు ప్రారంభించారు. ఐటీ అధికాయి దాడు చేపట్టినపుడు విజయ్ నైవేలీలో మాస్టర్ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఐటీ అధికాయిఅక్కడికి వెళ్లి విచారణ నిమిత్తం తమకారులో ఎక్కించుకుని చెన్నైకి తీసుకొచ్చారు. షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. తన కారులో లేదా విమానంలో వస్తానని విజయ్ కోరినా అధికాయి అంగీకరించలేదు. 15 మంది అధికాయి స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లపై పనయూరులోని ఇంట్లో విజయ్‌ను విచారించారు. విజయ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కీక డాక్యుమెంట్లను అధికాయి తీసుకెళ్లారు. సుమారు రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తొస్తోంది. అన్బుసెళియన్, విజయ్ వారి కుటుంబీకు, స్నేహితు బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేయాని నిర్ణయించారు.
అభిమానుల్లో ఆగ్రహం
తమ అభిమాన నటుడు విజయ్‌ను షూటింగ్‌ను నిలిపివేయించి మరీ తీసుకురావడం ఏమిటని ఆయన అభిమాను ఐటీ అధికారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా వెంటపెట్టుకుని తీసుకెళ్లడానికి విజయ్ ఏమన్నా తీవ్రవాదా అని ప్రశ్నిస్తున్నారు. వందలాది మంది అభిమాను విజయ్ ఇంటి ముందు గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చింది.