ఇది చారిత్రక నిర్ణయం

రామాలయంపై యోగా గురు రామ్‌దేవ్‌ బాబా

కోసపేట: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ట్రస్టు పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు చేసిన ప్రకటనను యోగా గురు రామ్‌దేవ్‌ బాబా స్వాగతించారు. రామాలయంతో పాటు, ఒక మ్యూజియం, రీసెర్చ్‌ సెంటర్‌, యూనివర్శిటీని కూడా అయోధ్యలో నిర్మించాలని ఆయన సూచించారు.
‘రామాలయం కోసం 67 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను ప్రధానిని, అమిత్‌షాను అభినందిస్తున్నాను. పార్లమెంటులో జైశ్రీరామ్‌ నినాదం చేయడం ద్వారా హిందువుగా చెప్పుకునేందుకు గర్వపడే ప్రధానిని మనం తొలిసారిచూశాం. మర్యాద-పురుష్తోత్తమ్‌ అయిన రాముడి పట్ల ఆయన తన భక్తిని చాటుకున్నారు’ అని రామ్‌దేవ్‌ బాబా అన్నారు. రామాలయంతో పాటు భారతదేశ సంస్క తిని ప్రతిబింబించేలా ప్రపంచ ప్రమాణాలతో కూడిన మ్యూజియం, వరల్డ్‌ క్లాస్‌ రీసెర్చ్‌ కేంద్రం, ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్శిటీ నిర్మించాలన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడకు వచ్చేవారికి భారతీయ సంస్క తి కళ్లకు కట్టేలా నిర్మాణాలు ఉండాలని రామ్‌దేవ్‌ సూచించారు.
శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర…
దీనికి ముందు, లోక్‌సభలో బుధవారం ఉదయం మోదీ మాట్లాడుతూ, ‘శ్రీ రామ జన్మభఊమి తీర్ధ కేత్ర’ అనే పేరుతో ట్రస్టు ఏర్పాటవుతుందని ప్రకటించారు. అయోధ్యలో రామాలయం అభివద్ధికి ఒక స్కీమ్‌ రెడీ చేశామని తెలిపారు.