సాయి భక్తులకు సంకటం

బాబా జన్మస్థలం పథ్రీకి రూ.100 కోట్ల కేటాయింపుపై భక్తుల ఆగ్రహం
  • -శివసేన నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రస్ట్‌
  • -ఆలయంలో అన్ని సేవలు బంద్‌
  • -దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు దర్శనం
  • -ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
  • -షిర్డీ కర్మభూమి అయితే పథ్రీ జన్మభూమి అంటున్న సర్కారు
  • -16వ ఏట షిర్డీకి వచ్చాడంటున్న చరిత్ర
  • -గ్రామస్థులతో చర్చించాకే భవిష్యత్‌ కార్యాచరణ అంటున్న ట్రస్ట్‌

ముంబాయి:
కులమతాలకు అతీతంగా అందరూ పూజించే కలియుగ దైవం సాయిబాబా. ఆయన పేరు స్మరించిన వెంటనే గుర్తొచ్చేది షిర్డీ. ఎప్పటి నుంచో షిరిడీలో సాయిబాబా ఆలయం ఉంది. దేశవ్యాప్తంగా ఎందరో భక్తులు ఆలయాన్ని ప్రతి ఏటా సందర్శిస్తుంటారు. అయితే ఆయన ఎప్పుడు, ఎక్కడ జన్మించారన్నది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ. కొంతమంది మాత్రం మహారాష్ట్ర పర్బణి జిల్లాలోని పథ్రీలో 1854వ సంవత్సరంలో ఓ వేపచెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా బాబా మొదటిసారి స్థానికులకు కనిపించారని చెప్పుకుంటారు. ఇక అలాగే 1918 అక్టోబర్‌ 15న బూటీవాడలో సమాధి అయ్యారని కూడా ప్రచారం ఉంది. అంతేకాకుండా బాబా దేవుడా.. లేక మనిషా అన్న భిన్న వాదనలు కూడా వినిపిస్తుంటాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలో అధికారం చేపట్టిన శివసేన ప్రభుత్వం సాయిబాబా జన్మస్థలమైన పథ్రీని అభివద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయించడంతో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే షిర్డీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని సంస్థాన్‌ ట్రస్ట్‌ వాదిస్తుండగా.. చుట్టు ప్రక్కల గ్రామ సర్పంచులు మాత్రం ఆలయాన్ని మూసివేస్తే సర్కార్‌ తలొగ్గుతుందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం స్థానికులతో ఈ వివాదంపై చర్చలు జరిపి తదుపరి కార్యాచరణ గురించి చెబుతామని సంస్థాన్‌ ట్రస్ట్‌ అధికారులు వెల్లడించారు.
ఇకపోతే బాబా జన్మస్థలం పాథ్రీనేనని.. అది నిరూపించడానికి ఆధారాలు కూడా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లాఖాన్‌ స్పష్టం చేశారు. షిర్డీ ‘కర్మభూమి’ అయితే.. పాథ్రీ ‘జన్మభూమి’ అని అన్నారు. దీన్ని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ కూడా సమ్మతించారన్నారు. ఈ రెండు ప్రదేశాలూ దేనికవే గొప్పవన్నారు.
మరోవైపు సాయిబాబా తన 16వ ఏటా షిర్డీకి వచ్చారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి షిర్డీలోనే ఉంటూ ప్రజల కష్టాలను తీర్చారని.. ఆ తర్వాత అంతర్ధానం అయ్యారని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఇక 1999లోనే బాబా జన్మస్థలం పథ్రీలో సాయి జన్మస్థాన్‌ మందిర్‌ను స్థానిక ప్రజలు నిర్మించడం జరిగింది. అటు షిర్డీలో కూడా ఎప్పటినుంచో ఆలయం ఉంది. నాడు తలెత్తని వివాదం నేడు ఎందుకు తెరపైకి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా, బీజేపీ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ వివాదం రాజుకుందని.. ఆలయాన్ని షిర్డీ నుంచి తరలించడానికి యోచిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇటు శివసేన మంత్రులు మాత్రం ఆలయ అభివద్ధికి నిధులు కేటాయిస్తే.. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
సాయిబాబా జన్మ స్థలం ఎక్కడ? ఆయన షిర్డీలో పుట్టలేదా? ఇప్పుడు ఈ అంశం దేశంలో కలకలం రేపుతోంది. షిర్డి సాయిబాబా పర్బిని జిల్లాలోని పత్రిలో పుట్టారని.. ఆ ఊరును డెవలఫ్‌ చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే ప్రకటించారు. దీంతో సాయిబాబా జన్మభూమి ఏంటి అనే దానిపై చర్చ మొదలైంది.

సద్గురు సాయిబాబా జన్మస్థలం పర్బిని జిల్లాకు చెందిన ‘పథ్రి’ అని స్థానికులు భావించి 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో పథ్రి పట్టణాభివద్ధికి వంద కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవలే ప్రకటించారు. అయితే దీనిపై భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇంత వరకు సాయిబాబా జన్మస్థలంపై వివాదం లేదని కేవలం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తెరపైకి వచ్చిందంటున్నారు. అందుకు ఉధ్దవ్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం కారణమని ఆరోపిస్తోంది విపక్ష బీజేపీ. పథ్రి.. పర్బిని జిల్లాలో ఉంది. అది ఆయన జన్మస్థలం అంటున్నారు. అలాగే షిర్డీ.. అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇది ఆయన సమాధి మందిరం. ఈ రెండు ప్రాంతాలకూ మధ్య దూరం 280 కిలోమీటర్లు. అక్కడ పుట్టి తర్వాత కాలంలో సాయి.. షిర్డీకి వచ్చినట్లు ఓ విశ్వాసం.
అహ్మద్‌నగర్‌ జిల్లాలోని షిరిడీ.. సాయిబాబా ‘కర్మ భూమి’ అయితే పత్రి ఆయన ‘జన్మభూమి’ అని ఉద్దవ్‌ సర్కారు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది బీజేపీ. పత్రికి ప్రాధాన్యం లభిస్తే తమ క్షేత్ర ప్రాధాన్యం తగ్గుతుందని షిరిడీ వాసులు భయాందోళనకు గురవుతున్నారంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడీ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
కాగా నేటినుంచి షిరిడీ ఆలయం మూసివేస్తామంటూ గ్రామస్తుల ప్రకటనను షిరిడీ ట్రస్ట్‌ ఖండించింది. గ్రామస్థుల ప్రకటనతో తమకు సంబంధం లేదని. భక్తులెవరూ ఆందోళన చెందవద్దని ఓ ప్రకటనలో తెలిపింది. స్వామి సేవలు యధావిధిగా కొనసాగుతాయని. గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని షిరిడీ ట్రస్ట్‌ తెలిపింది.
షిర్డిలో కొలువైన సాయిబాబాకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. సాయి దివ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో షిర్డీకి తరలి వస్తుంటారు. ఈనేపథ్యంలో ఆలయాన్ని నిరవధికంగా మూసివేసే నిర్ణయం సరైందేనా? కాదా? అన్న అంశంపై సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ సభ్యులు చర్చించనున్నారు.
స్థానికులతో సమావేశం అనంతం తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబా సంస్థాన్‌ సభ్యుడు బహుసాహెబ్‌ ప్రకటించారు.
‘సాయిబాబా జన్మభూమి’పై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆదివారం నుంచి శిరిడీ ఆలయం మూసివేయనున్నారని జాతీయా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ స్పందించింది. బంద్‌ కేవలం శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాలకే పరిమితమని స్పస్టం చేసింది. గ్రామస్థుల బంద్‌తో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ పిలుపుపై వారితో చర్చించబోతున్నామని ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు ఈరోజు సాయంత్రం గ్రామస్థులు సమావేశం కానున్నట్లు సమాచారం.
సాయి బాబా జన్మస్థలంగా చెబుతున్న ‘పాథ్రీ’ పట్టణ అభివద్ధికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రూ.100కోట్లు కేటాయించడంతో కొత్త వివాదానికి తెరలేసింది. దీంతో శిరిడీ ప్రాశస్య్తం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా వివాదంపై శిరిడీ గ్రామస్థులు, బాబా ట్రస్ట్‌ వారు స్పందిస్తూ.. తమ ఆందోళన పాథ్రీ అభివ ద్ధిపై కాదని.. సాయి జన్మస్థలాన్ని వివాదం చేయడమేనని చెప్పుకొచ్చారు.