న్యూడుల్స్‌ స్పెషల్‌

సన్నని, స్ట్రింగ్‌ లాంటి పిండి ముక్కల యొక్క మూలం తరచుగా ఎండబెట్టి, తరువాత వండుతారు. నూడుల్స్‌ అని పిలువబడేది కొన్నిసార్లు ఆధునిక తూర్పు ఆసియా రకంగా మాత్రమే పరిగణించబడుతుంది మరియు సాధారణ రకం కాదు మరియు తదనుగుణంగా దాని మూలం సాధారణంగా చైనీస్‌ అని జాబితా చేయబడుతుంది, అయితే ఇది పాస్తాను కలిగి ఉన్నప్పుడు మరింత వివాదాస్పదమవుతుంది. చైనాలో నూడుల్స్‌ యొక్క మొట్టమొదటి వ్రాతపూర్వక రికార్డు తూర్పు హాన్‌ కాలం (25-220)నాటి పుస్తకంలో కనుగొనబడింది. ఇది హాన్‌ రాజవంశం ప్రజలకు ప్రధానమైన ఆహారంగా మారింది. పాస్తా యొక్క మూలం మధ్యధరా దేశాల నుండి వచ్చినదని ఆహార చరిత్రకారులు సాధారణంగా అంచనా వేస్తున్నారు:


హాకా వెజిటబుల్‌ నూడుల్స్‌

కావలసినవి

హాకా నూడుల్స్‌: పావుకిలో, ఉల్లికాడలు: 2 టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌: ఒకటి, బీన్స్‌: నాలుగు, క్యాబేజీ: చిన్నముక్క, పుట్టగొడుగులు: నాలుగు, క్యాప్సికమ్‌: ఒకటి, సోయాసాస్‌: టేబుల్‌స్పూను, వినెగర్‌: టీస్పూను, చిల్లీ సాస్‌: టీస్పూను, మిరియాలపొడి: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: టేబుల్‌స్పూను, వెల్లుల్లి రెబ్బలు: రెండు

తయారుచేసే విధానం

  • బాణలిలో నీళ్లు పోసి మరిగించి నూడుల్స్‌ వేసి ఉడికించి ఆ నీళ్లన్నీ వంపేసి చల్లని నీళ్లతో కడిగితే విడివడతాయి.
  • కూరగాయలన్నీ సన్నని ముక్కల్లా తరిగి ఉంచాలి.
  • చిన్న గిన్నెలో వినెగర్‌, సాస్‌ వేసి కలపాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత ఉల్లికాడలు, క్యారెట్‌ముక్కలు వేసి కాస్త వేగాక పుట్టగొడుగులు, బీన్స్‌ముక్కలు వేయించాలి. క్యాప్సికమ్‌, క్యాబేజీ ముక్కలు కూడా వేసి వేగాక సాస్‌మిశ్రమం వేసి కలపాలి. ఉడికించి చల్లార్చిన నూడుల్స్‌ వేసి కలిపి మిరియాలపొడి వేసి ఓ రెండు నిమిషాలు వేయించి దించితే సరి.

గుడ్డు నూడుల్స్‌

కావలసినవి:

హాకా నూడుల్స్‌: పావుకిలో, క్యారెట్‌, క్యాప్సికమ్‌ ముక్కలు: పావుకప్పు చొప్పున, సోయాసాస్‌: టీస్పూను, టొమాటో సాస్‌: 2 టీస్పూన్లు, పాస్టాసాస్‌: 2 టీస్పూను, నిమ్మరసం: అరటీ స్పూను, గుడ్లు: రెండు, వెల్లుల్లిరెబ్బలు: మూడు, ఉల్లిపాయ: ఒకటి, మిరియాలపొడి: అరటీస్పూను, నూనె: 2 టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం:

  • నీళ్లు మరిగించి నూడుల్స్‌ ఉడికించి చల్లని నీళ్లతో కడిగి ఉంచాలి.
  • బాణలిలో అరటీస్పూను నూనె వేసి గుడ్లసొన, చిటికెడు ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుతూ పొరటులా వేయించి తీసి పక్కన ఉంచాలి. మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి సోయాసాస్‌ వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు పాస్టా సాస్‌, టొమాటో సాస్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. గుడ్డు పొరటును కూడా వేసి బాగా కలపాలి. చివరగా ఉడికించి పక్కన ఉంచిన నూడుల్స్‌ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత నిమ్మరసం కలిపి దించాలి.

ఆమ్లెట్‌ నూడుల్స్‌

గుడ్డు బలవర్థకమైన పదార్థం. అలాగని చిన్నారులను రోజుకో గుడ్డు తినమంటే బోర్‌ అనేస్తారు. అలాంటి పిల్లలకు ఈసారి గుడ్డుతో నూడుల్స్‌ చేసిపెట్టండి. అదెలా అంటారా…!

కావల్సినవి: గుడ్లు – రెండు, ఉల్లిపాయ ముక్కలు – కప్పు, క్యాప్సికం – ఒకటి, టొమాటో ముక్కలు – పావుకప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు – చెంచా చొప్పున, మిరియాల పొడి – అరచెంచా, ఉప్పు – తగినంత, నూనె – పావు కప్పు, కారం – అర చెంచా, పసుపు – చిటికెడు , కొత్తిమీర తరుగు – గుప్పెడు.

తయారీ: మొదట బాణలిని పొయ్యిమీద పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక గుడ్ల సొనను గిలకొట్టి ఆమ్లెట్‌లా పోయాలి. దీనిపై ఉప్పు, పావుచెంచా చొప్పున కారం, మిరియాల పొడి చల్లి, రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. దీన్ని గుండ్రంగా చుట్టి సన్నగా, నూడుల్స్‌ ఆక తిలో వచ్చేలా కోసి పెట్టుకోవాలి. ఇంతకు ముందు ఉపయోగించిన బాణలినే మళ్లీ పొయ్యి మీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు టొమాటో, క్యాప్సికం ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిగిలిన కారం, మిరియాలపొడి వేయాలి. ఇందులోని నీరంతా ఇంకిపోయి, కూరగాయ ముక్కలు దగ్గరకి వచ్చాక కొత్తిమీర, కోసిపెట్టుకున్న ఆమ్లెట్‌ నూడుల్స్‌ వేసి రెండు నిమిషాలపాటు కలిపి దింపేస్తే చాలు.


పుట్టగొడుగుల నూడుల్స్‌

కావలసినవి

పుట్టగొడుగులు: పావుకిలో, నూడుల్స్‌: పావుకిలో, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి: పది రెబ్బలు, క్రీమ్‌: కప్పు, చీజ్‌ తురుము: 2 టేబుల్‌స్పూన్లు, వెన్న: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, మిరియాలపొడి: అరటీస్పూను

తయారుచేసే విధానం

  • నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి.
  • పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి.
  • బాణలిలో టేబుల్‌స్పూను వెన్న వేసి కరిగించాలి. ఉడికించిన నూడుల్స్‌, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మిగిలిన వెన్న వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. పుట్టగొడుగుల ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్‌, క్రీమ్‌ వేసి కాసేపు ఉడికించాలి. చివరగా తురిమిన చీజ్‌ వేసి ఓ నిమిషం వేయించి దించాలి.

చైనీస్‌ చికెన్‌ నూడుల్స్‌

కావలసినవి:

నూడుల్స్‌: అరకిలో, సోయాసాస్‌: అర కప్పు, నువ్వులనూనె: పావుకప్పు, పంచదార: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: మూడు, చైనీస్‌ చికెన్‌ కోసం: సోయాసాస్‌: పావుకప్పు, తెరియాకి సాస్‌: పావుకప్పు, వెల్లుల్లిరెబ్బలు: రెండు, ముడిపంచదార: పావుకప్పు, అల్లంతురుము: టీస్పూను, బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, నువ్వులనూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం:

  • వెడల్పాటి బాణలిలో చికెన్‌కోసం తీసుకున్న సోయాసాస్‌, తెరియాకి సాస్‌, వెల్లుల్లిముక్కలు, పంచదార, అల్లంతురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌కు పట్టించి ఫ్రిజ్‌లో రెండుమూడు గంటలు నానబెట్టాలి.
  • వెడల్పాటి బాణలిలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. అందులో నూడుల్స్‌ వేసి ఉడికించి నీళ్లు వంపేసి ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో నూడుల్స్‌కోసం తీసుకున్న సోయాసాస్‌, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. పంచదార కరిగిన తరవాత ఈ మిశ్రమాన్ని నూడుల్స్‌లో వేసి బాగా కలపాలి.
  • విడిగా ఓ బాణలిలో నూనె వేసి కాగాక చికెన్‌ ముక్కలు వేసి ఓ పది నిమిషాలు వేయించాలి. తరవాత మూతపెట్టి ఉడికించాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక అందులో విడిగా ఉడికించి ఉంచిన నూడుల్స్‌ వేసి, కాసిని నువ్వులు, ఉల్లిముక్కలతో అలంకరించి అందించాలి.