మోగిన… ఢిల్లీ ఎన్నికల నగారా

ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

  • నోటిఫికేషన్‌- జనవరి 14
  • నామినేషన్ల ముగింపు- జనవరి 21
  • నామినేషన్ల పరిశీలన- జనవరి 22
  • నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 24
  • ఎన్నికల పోలింగ్‌ – ఫిబ్రవరి 8
  • ఓట్ల లెక్కింపు- ఫిబ్రవరి 11
  • -మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
  • -13,767 పోలింగ్‌ కేంద్రాలు
  • -90వేల మంది భద్రతా సిబ్బంది

న్యూఢిల్లీ:
దేశ రాజధాని న్యూఢిల్లీలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగుతుందని.. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని అరోడా చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 13,767 పోలింగ్‌ కేంద్రాలు, 90వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. దిల్లీలో నేటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని అరోడా స్పష్టం చేశారు.
ఢిల్లీ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు: జనవరి 14 నోటిఫికేషన్‌ ఇస్తారు. జనవరి 21 నామినేషన్లకు ముగింపు. జనవరి 22 నామినేషన్ల పరిశీలన కాగా ఉపసంహరణకు జనవరి 24. ఇక ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 8న ఉండగా ఓట్ల లెక్కింపు మాత్రం ఫిబ్రవరి 11 ఉంటుంది.
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని అరోడా చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 13,767 పోలింగ్‌ కేంద్రాలు, 90వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. దిల్లీలో నేటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని అరోరా స్పష్టం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారాకు ముహూర్తం ఖరారైంది. అధికారికంగా ఎన్నికల తేదీలను ఈసీ ఇవాళ ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరుకు ఆప్‌ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం ముగియనుండటంతో ఈలోపే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ పట్టుదలగా ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.. కాగా, ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘ఆప్‌’ అన్ని పార్టీల కంటే ముందుగా ఇటీవల లాంఛనంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించి, పలు కొత్త పథకాలు ప్రకటించింది. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా సాధిస్తామని, తమ ఎన్నికల ఎజెండాలో ఇదే ప్రధానాంశమని ప్రకటించింది. విపక్షాలు సూచనలు ఇస్తే… వచ్చే ఐదేళ్లలో వాటిని కూడా అమలు చేస్తామంటూ రాబోయే ఐదేళ్లూ తమవేనన్న ధీమాతో ముందుకు దూసుకుపోతోంది.
అనధికార కాలనీలను రెగ్యులరైజ్‌ చేసి అందరికీ పట్టాలు ఇస్తామని, ఢిల్లీవాసుల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే అభివ ద్ధి నల్లేరు మీద నడకేనని బీజేపీ ముందస్తు ప్రచారం మొదలుపెట్టింది. ఢిల్లీ ప్రజలు తెలివైన వారని, ఈసారి ఢిల్లీలో అధికారం బీజేపీదేనని అమిత్‌షా ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఢంకా బజాయించారు. మోదీ పేరు, సీఏఏ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తామని ఆయన ప్రకటించారు. దీనికి ముందు, రామ్‌లీలా మైదానంలో ‘భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం’ అనే నినాదంతో బీజేపీ ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ గత నెలాఖరులో ప్రారంభించారు.
ఇక, కాంగ్రెస్‌ సైతం సీఏఏకు వ్యతిరేక ప్రచారాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని, కాంగ్రెస్‌ 15 ఏళ్ల హయాంలో చేసిన అభివద్ధి పనులు ఈరోజూ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయని ప్రచారం చేయడం ద్వారా మరోసారి హస్తినలో విజయకేతనం ఎగురవేయాలని అనుకుంటోంది. ఇటీవల మహారాష్ట్ర, జార?ండ్‌లో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో విజయం సాధించడం కూడా కాంగ్రెస్‌కు కొత్త ఊపిరినిచ్చింది.