ఆదాయం కోసం సర్కార్‌ భూ..మంతర్‌ !

తెలంగాణలో ఆరేళ్ల తర్వాత పెరగనున్న భూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
  • -సీఎం సూచనల మేరకు అధికారుల కసరత్తు
  • -ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కడానికే..
  • -మొన్న మద్యం ధరలు, త్వరలో భూముల విలువ పెంపు
  • -ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తున్న సర్కారు
  • -సుదీర్ఘ కసరత్తు చేస్తున్న రిజిస్ట్రేషన్లశాఖ
  • -భూముల విలువ మదింపులో హేతుబద్ధత
  • -పంచాయతీ ఎన్నికల తర్వాతే కీలక నిర్ణయం
  • -రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఊతం
  • -క్రయవిక్రయాలు పెరుగుతాయనే నమ్మకం
  • -ఏపీలో ఇప్పటికే నాలుగు సార్లు పెంపు

త్వరలో రాష్ట్రంలో భూ విలువలు పెరగనున్నాయా? భూమి విలువ మదింపులో రిజిస్ట్రేషన్ల శాఖ హేతుబద్ధతతో ముందుకువెళ్తోందా? ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం సూచనల మేరకు ప్రజలపై అధిక భారం పడకుండా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని సమాచారం. కాగా దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌కు.. నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్రంలో భూముల విలువను హేతుబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువను పెంచడం లేదా సవరించడం వల్ల సామాన్యులకు మేలు జరుగడంతోపాటు రాబడి కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏడాది కిందటే చాలాచోట్ల భూముల విలువను సవరిస్తూ అధికారులు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. భూముల విలువ మదింపులో గతంలో లేనివిధంగా రిజిస్ట్రేషన్లశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి భూముల విలువల్లో హెచ్చుతగ్గులను సవరించే ప్రయత్నం చేస్తున్నది. బహిరంగ మార్కెట్‌లో వాస్తవంగా ఉన్న భూముల విలువను ప్రామాణికంగా తీసుకొని రిజిస్ట్రేషన్‌ చార్జీలను సరిచేస్తారు. దీని ప్రకారం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరిగే అవకాశాలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ విలువ, ప్రభుత్వ విలువ మధ్య తేడా ఎక్కువగా ఉన్నందున భూమి విలువలను సవరించాల్సిన అవసరమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల విలువ పెంపు, సవరణపై త్వరలో సీఎం కేసీఆర్‌కు రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా రేట్లు, ఏయే ప్రాంతాల్లో ఎన్ని స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవుతున్నాయనే విషయాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పర్యవేక్షణలో వివరాలు సేకరిస్తున్నారు. క్రెడాయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌ వంటి రియల్టర్‌ సంఘాలతో కూడా చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో భూముల విలువను హేతుబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువను పెంచడం లేదా సవరించడం వల్ల సామాన్యులకు మేలు జరుగడంతోపాటు రాబడి కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏడాది కిందటే చాలాచోట్ల భూముల విలువను సవరిస్తూ అధికారులు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. భూముల విలువ మదింపులో గతంలో లేనివిధంగా రిజిస్ట్రేషన్లశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి భూముల విలువల్లో హెచ్చుతగ్గులను సవరించే ప్రయత్నం చేస్తున్నది.
బహిరంగమార్కెట్‌లో వాస్తవంగా ఉన్న భూముల విలువను ప్రామాణికంగా తీసుకొని రిజిస్ట్రేషన్‌ చార్జీలను సరిచేస్తారు. దీని ప్రకారం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరిగే అవకాశాలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ విలువ, ప్రభుత్వ విలువ మధ్య తేడా ఎక్కువగా ఉన్నందున భూమి విలువలను సవరించాల్సిన అవసరమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల విలువ పెంపు, సవరణపై త్వరలో సీఎం కేసీఆర్‌కు రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. సీఎం అనుమతినిస్తే ముందుకువెళ్లేలా రంగం సిద్ధం చేసుకొంటున్నారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా రేట్లు, ఏయే ప్రాంతాల్లో ఎన్ని స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవుతున్నాయనే విషయాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పర్యవేక్షణలో వివరాలు సేకరిస్తున్నారు. క్రెడాయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌ వంటి రియల్టర్‌ సంఘాలతో కూడా చర్చిస్తున్నారు.
పొరుగు రాష్ట్రంలో నాలుగుసార్లు..
గత ఆరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ పెంచలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్‌ వ్యాపారం బాగా పెరగడంతోపాటు మార్కెట్‌ విలువ, బేసిక్‌ బుక్‌వ్యాల్యూ మధ్య చాలా తేడా రావడంతో అసమతుల్యత నెలకొన్నదనే భావన నెలకొన్నది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏడాదికోసారి భూముల విలువల్ని సవరించడం లేదా స్టాంప్‌ డ్యూటీని పెంచుతుంటారు. పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నాలుగుసార్లు భూమి విలువను సవరించడంతోపాటు స్టాంప్‌డ్యూటీని పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజును 7.5 శాతానికి పెంచగా.. తెలంగాణలో అది 6 శాతంగానే ఉన్నది. తెలంగాణ ఆవిర్భవించిన ఏడాదికే రియల్‌ఎస్టేట్‌ అనూహ్యంగా జోరుపుంజుకొన్నది. బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ అమాంతం పెరిగిపోయింది.
నల్లధన ప్రవాహానికి చెక్‌!
వాస్తవానికి స్థిరాస్తిరంగంలో నల్లధనం ప్రవాహం అధికంగా ఉంటుంది. పెద్దనోట్ల రద్దు అనంతరం కఠిన ఆంక్షలు అమలులోకి రావడంతో నల్లధనం ఫ్లో కొంత తగ్గింది. చాలా డాక్యుమెంట్లలో మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ధరను పేర్కొంటుండటం వల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతున్నది. రియల్‌ మార్కెట్‌లో ప్రభుత్వం నిర్ణయించిన బుక్‌వ్యాల్యూ ప్రకారం ఒక ధర ఉంటే.. బహిరంగ మార్కెట్‌ మరోలా ఉంటున్నది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన విలువ కంటే మార్కెట్‌ విలువ మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉన్నది.
ఉదాహరణకు మియాపూర్‌, అత్తాపూర్‌, మాదాపూర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌లో బహిరంగ మార్కెట్‌ విలువ గజానికి సగటున రూ.40 వేల నుంచి 60 వేల వరకు ఉండగా.. బుక్‌వ్యాల్యూలో గజానికి రూ.10వేలుగానే ఉన్నది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు రూ.2 వేల వరకు ఉంటే.. బహిరంగ మార్కెట్‌లో రూ.4 వేల నుంచి 5 వేల వరకు ఉన్నది. రూ.రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వడానికి వీలులేదనే ఆదాయ పన్నుశాఖ నిబంధన.. స్థిరాస్తిరంగంలో రియల్‌ ధనం పెరగడానికి దోహదపడింది. భూముల రిజిస్ట్రేషన్‌ ఫీజులు ప్రజలకు భారం కాకుండా తెలంగాణ రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ మేరకు బహిరంగ మార్కెట్‌ విలువను కుదించి కనీసస్థాయిలోనే పన్ను ఉండేలా ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో ఉన్న మొత్తం విలువను 30 నుంచి 40 శాతానికి కుదించి 60 నుంచి 70 శాతం విలువను మాత్రమే బుక్‌వ్యాల్యూగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఫలితంగా ఫీజుల భారం కొంతవరకు తగ్గనున్నది. భూముల విలువ మదింపులో హేతుబద్ధతను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకొన్న ఉన్నతాధికారులు బుక్‌వాల్యూను తగ్గించేందుకు కూడా అదే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు భారం తగ్గడంతోపాటు భూముల క్రయవిక్రయాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
వాస్తవానికి స్థిరాస్తిరంగంలో నల్లధనం ప్రవాహం అధికంగా ఉంటుంది. పెద్దనోట్ల రద్దు అనంతరం కఠిన ఆంక్షలు అమలులోకి రావడంతో నల్లధనం ఫ్లో కొంత తగ్గింది. చాలా డాక్యుమెంట్లలో మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ధరను పేర్కొంటుండటం వల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతున్నది. రియల్‌ మార్కెట్‌లో ప్రభుత్వం నిర్ణయించిన బుక్‌వ్యాల్యూ ప్రకారం ఒక ధర ఉంటే.. బహిరంగ మార్కెట్‌ మరోలా ఉంటున్నది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన విలువ కంటే మార్కెట్‌ విలువ మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉన్నది. భూముల విలువ మదింపులో హేతుబద్ధతను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకొన్న ఉన్నతాధికారులు బుక్‌వాల్యూను తగ్గించేందుకు కూడా అదే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు భారం తగ్గడంతోపాటు భూముల క్రయవిక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నారు.