‘దిశ’ లేని సమాజంలో దశకంఠులెందరో!!!

  • -బాల్యం నుంచే అదుపుతప్పుతున్న చిన్నారులు
  • -సినిమా, టీవీ మాధ్యమాలలో శృంగార సన్నివేశాలు
  • -స్మార్ట్‌ఫోన్లలో విచ్ఛలవిడిగా హాట్‌ సీన్లు
  • -విషసంస్కృతి చిమ్ముతున్న పోర్న్‌ సైట్లు
  • -నిషేధం నామమాత్రం..పట్టించుకోని యంత్రాంగం
  • -ఉద్యోగాల బిజీలో పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రులు

హైదరాబాద్‌:
వాళ్లంతా మద్యం మత్తులో మనుషులమని మరిచిపోయారు.. మానవత్వాన్ని తమ క్షణకాల సుఖానికి తాకట్టు పెట్టారు.. చివరి దశలో హత్యకు పూనుకున్నారు. దారుణంగా ఓ యువతిని అగ్నికి ఆహుతి చేశారు. దీని పర్యవసానం వారం వ్యవధిలోనే ఆ నలుగురు విగతజీవులై మిగిలారు. వ్యవసం ఓ వైపు .. వాంఛలు మరోవైపు.. వీరిని నేరాలవైపు పురికొల్పాయి… ఫలితంగా వీరి నుదుట పోలీసులు మరణ శాసనం లిఖించారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో నిందితులు తమ జీవితాన్ని తామే ముగించుకున్న వైనమిది. అధికశాతం మంది పోలీసు చర్యను సమర్థించగా..కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అసలు చంపాల్సింది నిందితులను కాదు వాళ్లను అలా తయారుచేసిన వ్యవస్థని చంపాలని కొందరు సామాజిక విశ్లేషకులు కోరుతున్నారు. కేవలం నలుగురి ఎన్‌కౌంటర్‌తో ఈ వ్యవస్థ మారదు..అలాంటి దశకంఠులు ఇంకెందరో ఉన్నారు ఈ సమాజంలో…వాళ్లంతా పెద్దమనుషుల ముసుగులో గుట్టుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
వారంతా కష్టజీవులు.. లారీలలో డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేస్తున్నారు.. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ సరదాగా తమ జీవితాన్ని గడపొచ్చు. కానీ చేతికందిన డబ్బులతో విచ్ఛలవిడిగా తాగుతూ మద్యానికి బానిసలయ్యారు. తమకు ఓ కుటుంబం ఉందని, భార్య, తల్లిదండ్రులు తమ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని వీరు గుర్తించి ఉంటే ఇంతటి దారుణానికి పాల్పడి ఉండేవారు కాదు. సాయం పేరుతో ఓ ఆడపిల్లకు వలవేయడం, తర్వాత అత్యాచారం చేయడం ఆపై దారుణ మారణకాండకు పూను కోవడం ఒకటి వెంట ఒకటి జరిగాయి. అమ్మాయిని కాల్చివేస్తే ఎవరూ గుర్తుపట్టరన్న పిచ్చినమ్మకంతో ఆమెను అగ్నికి ఆహుతి చేశారు. కానీ ఈ సంఘటనతో జనసమూహం అగ్నిగోళంగా మారింది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ గర్జించింది. పోలీసులకు కూడా ఇదే సరైన నిర్ణయం అనిపించిందో ఏమో జనం అనుకున్నదే చేశారు. ఫలితం ఎక్కడ దిశను పొట్టన పెట్టుకున్నారో అక్కడే నలుగురు అంతమయ్యారు. తమను నమ్ముకున్న కుటుంబాలను అగాధంలో ముంచి వారివారి వంశాలకు తీరని మచ్చని మిగిల్చి దిక్కులేని చావు చచ్చారు. ఇది వారి కుటుంబాల్లో ఎంత కన్నీరు నింపుతుందో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ దిశగా అడుగులు వేసేవారు కాదేమో.
మార్పు రావాలి
సామాజిక మాధ్యమాలను పరిశీలించినా, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నా యువతలో నేర ప్రవత్తి నానాటికి పెరుగుతున్నది సత్యం. దిశ హత్యోదంతాన్ని తీసుకున్న హత్యానంతరం సామాజిక మాధ్యమాల్లో కొందరు యువకులు ఆమె గురించి రాసిన తప్పుడు రాతలను చూసినా, ఇంత ఘోరమైన సంఘటన వేడిచల్లారక ముందే పలుచోట్ల ఆడపిల్లలపై జరిగిన దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యోందాలను చూసినా యువతలో నేర ప్రవత్తి ఎంతగా పెరుగుతుందో స్పష్టమవుతుంది. అయితే రోజురోజుకు చట్టాలు కఠినతరమవుతున్నాయి. జనాల్లో చైతన్యం కనిపిస్తోంది. దిశ హత్య తర్వాత నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని మూకుమ్మడిగా చేసిన డిమాండ్లను చూసినా ఎన్‌కౌంటర్‌ తర్వాత జనాల నుంచి పోలీసులకు మద్ధతుగా వచ్చిన స్పందనను చూసినా ఎలాంటి మార్పులు వస్తున్నాయో స్పష్టమవుతుంది.
పోర్న్‌ వాస్తవానికి ఇది విదేశీ సంస్కతి… కాని భారత్‌ లాంటి జనాబా ఉన్న దేశాల్లో మంచి వ్యాపారం. పెరుగుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ద్వారా దీనిని అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. పోర్న్‌ వీడియోలు చూడటానికి అలవాటు పడి వాటికి బానిసలు గా మారిన యువత మనుషులం అని మర్చిపోయి ప్రవర్తిస్తుంది… ఎంత మందిలో ఉన్నా సరే యువత పోర్న్‌ వీడియోలు చూడటం, వాటి ద్వారా తమలో ఉన్న మగాన్ని పెంచి పోషిస్తున్నారు… అద్దు అదుపు లేకుండా రోడ్ల మీద పడుతున్నారు.
ఆరేళ్ళ చిన్నారిని అత్యాచారం చేసిన 14 ఏళ్ళ పిల్లాడు… కారణం అతని ఫోన్‌ లో ఉన్న పోర్న్‌ వీడియోలు… డబ్బున్న తల్లి తండ్రులు అతగాడికి ఫోన్‌ కొనివ్వడంతో ఒంటరిగా సమయంలో వీక్షిస్తూ తమలో ఉన్న కోరికలను అదుపు చేసుకోలేక కనపడిన వారి మీద కోరికలు తీర్చుకుంటున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు… ముఖ్యంగా 18 ఏళ్ళు లోపు యువత పోర్న్‌కి బానిసలుగా మారి మగాల మాదిరి ప్రవర్తిస్తున్నారు.
ఇక పెద్దాళ్ళు అయితే వద్దుల మీద కూడా అత్యాచారం చేయడం మనం చూస్తున్నాం. అత్యాచార కేసుల్లో ఉన్న యువతలో 72 శాతం కేసుల్లో పోర్న్‌ బారిన పడిన వారే ఉన్నారు. కనపడిన వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉంటూ మనుషులం అని మర్చిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడంతో ఇప్పుడు తల్లి తండ్రులు భయపడిపోతున్నారు.
తమ ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తుందో రాదో అనే భయం నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి… పోర్న్‌ వీడియోల బారి నుంచి యువతను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు వాపోతున్నారు. లేకపోతే చిన్న పిల్లలు కోరికలకు బలైపోతున్నారని అంటున్నారు. ఇటీవల 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలపై సైతం మ గాళ్లు అత్యాచారాలు చేస్తుండడం చూస్తున్నాం. ఇకపై అయినా ప్రభుత్వాలు వీటి నిషేధానికి కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీలను భోగ వస్తువులుగా చూపించే సినిమా, టీవీ వంటి సాధనాలు, సాలెగూడు లాంటి ఇంటర్‌నెట్‌లో చిక్కి అంతర్జాల అసభ్య అశ్లీల చిత్రాలు ఆదాయంగా మలుచుకునే ప్రభుత్వం, విరివిగా మధ్యం అమ్మకాలు అసలు కారణాలు. వీటిని నియంత్రించకుండా, నిరోధించాలని అనుకోని ప్రభుత్వ విధానమే లైంగికదాడి నేరాన్ని పెంచిపోషించింది. ప్రపంచ వస్తువు సంస్క తి వ్యామోహాలకు, స్వంత లాభం కోల్పోతున్న విద్యా ఉద్యోగ అవకాశాల వల్ల నిరుద్యోగులు, చిరుద్యోగులవుతూ స్వసుఖాల మరీచికల వెంబడి పరుగులు తీస్తూ నిరాశా, నిస్ప హలకు లోనవుతూ మరిచిపోవడానికి మద్యం తాగుతూ మత్తులో అడ్డుదారులు తొక్కుతున్న యువతరం తయారుకావడానికి పునాది ఈనాటి రాజకీయార్థిక విధానాల్లోనే ఉంది. సామాజిక హింసను చూసీచూడనట్టు వదిలెయ్యటం, హింసకు తక్షణ సాధనాలైన మనుషుల మీదికే కసిని కోపాన్ని మళ్ళించి మూలాల గురించి ఆలోచించకుండా చేయడం పాలకవర్గాల తక్షణ ప్రయోజనాలను ఈడేరుస్తోంది. కానీ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. అత్యాచార సంఘటనలు పునరావ తం కాకుండా వుండాలంటే శిక్ష ఒక్కటే మార్గం కాదు. ద క్పథం మారాలి. స్త్రీల పట్ల సామాజిక ద క్పథం నూతనంగా రూపొందాలి. స్త్రీని అంగడి సరుకుగా కాదు స్త్రీ ఒక మానవ వ్యక్తిగా సమానమైన వ్యక్తిగా గుర్తించి గౌరవించగల ఉత్తమ సంస్కారాలను అభివ ద్ధిపరిచే ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు కాదా?
లైంగికదాడుల పెరుగుదల రేటుకు సామ్రాజ్యవాద సంస్క తి, మహిళల అక్రమ రవాణా పెరిగిందంటే… మహిళలను అమ్మకపు సరుకుగా, వారి శరీరాలను వ్యాపారంగా మార్చి, సొమ్ము చేసుకుంటున్న బేహారులున్నంత కాలం లైంగికదాడులు ఆగుతాయా? అధికారిక గణాంకాల ప్రకారమే రోజుకు 180మంది బాలబాలికలు అద శ్యమైపోతున్న దేశంలో లైంగిక దాడుల ఉధ తి భీతిల్లచేస్తోంది. మద్యం దుకాణాలు, రాత్రి క్లబ్బులు, పబ్బుల యాజమాన్య వర్గం పాలకవర్గమేనన్నది అందరికీ తెలుసు. వీటన్నింటికీ వెన్నుదన్నుగా ఉన్న రాజ్యాన్ని నిలేయాలి. అత్యాచార నేరస్థులను శిక్షిద్దాం. కానీ… నేరం జరిగే అవకాశాలు పరిస్థితులను వదిలెయ్యటమా? నేరం జరిగే వరకు ప్రేక్షకుల వలే ఉండి నేరం జరిగాక నేరస్తుడినే శిక్షించటం వలన నేరాల సంఖ్య తగ్గించదు.
ముఖ్యంగా అత్యాచార ఘటనలపై బాధితురాలినే బాధ్యురాలిగా పరిగణిస్తూ.. బాధించే సంస్కతి రమీజాబీ అత్యాచార సందర్భం నుంచి నిరసించబడుతూనే ఉంది. నాలుగు దశాబ్దాలు గడిచినా స్త్రీని చూసే చూపు మారలేదంటే మన అభివ ద్ధి అంతా బలుపే కానీ… బలం కానే కాదు. మొదట బాధితులు చెప్పేది నమ్మండి.. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టాలి. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలి. లైంగికదాడుల నేరాలకు మరణశిక్ష సమాధానం కాదు. లైంగికదాడులను అలవాటుగా మారుస్తున్న అధికార దౌర్జన్యాల ఆర్థిక లాభాపేక్షల దుష్ట సంస్క తిపై యుద్ధం ప్రకటించాలి. కన్నీట తడిసిన ప్రశ్నల్ని కత్తుల్లా సంధిస్తూ నిలదీయాలి.