మందుల ‘గోల్‌’ మాల్‌లో వసూల్‌…రాణి

ఉద్యోగులే బినామీలుగా రూ. 200 కోట్ల మెడిసిన్‌ స్కామ్‌..ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన దేవికా రాణి.. తెర వెనుక ఉన్న పెద్దలెవరు? రాకెట్‌ నడిపిందెవరు?
  • -రూ.10 కోట్లకు పైగా జరిగిన కుంభకోణం
  • -హైదరాబాద్‌, వరంగల్‌లో ఒకేసారి తనిఖీలు
  • -దేవికారాణి ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభ్యం
  • -ఓ మాజీ మంత్రి అల్లుడి హస్తంపై అనుమానాలు
  • -బినామీ పేరుతో వ్యవహారం నడిపిన ‘మంత్రి అల్లుడు’
  • -భారీ స్కాముకు సహకరించిన ఓ అజ్ఞాత జర్నలిస్ట్‌
  • -త్వరలోనే నిజాలు వెల్లడిస్తామంటున్న ఏసీబీ అధికారులు
  • -కోట్ల విలువైన నకిలీ బిల్లులు లభ్యం
  • – స్కాములో మరో 20 మంది దేవిక అనుచరులు
  • -తవ్వినకొద్దీ బయడపడుతున్న ‘మందుల మాయగాళ్లు’

హైదరాబాద్‌:
రాష్ట్రంలోనే పెను సంచలనం రేకెత్తించిన మెడికల్స్‌ స్కాము కేసులో ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. షేక్‌పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో తెలిసిందే. దీంతో నిన్నంతా దేవికా రాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. షేక్‌పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో తెలిసిందే. దీంతో గురువారం దేవికా రాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఉద్యోగులు, నలుగురు ప్రయివేట్‌ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈఎస్‌ఐ మందుల కుంభకోణం వ్యవహారంలో నిందితులకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇందిర, ఫార్మాసిస్ట్‌ రాధిక, ఉద్యోగి నాగరాజుతో పాటు ఒమ్ని ఫార్మా సంస్థకు చెందిన ఇద్దరికి వచ్చేనెల 11 వరకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఏసీబీ అధికారులు నిందితులను అరెస్టు చేసిన అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. త్వరలోనే వారిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నకిలీ బిల్లులు సష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ, సుమారు రూ.10 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లోనూ ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో దేవికా రాణితో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఫార్మసిస్ట్‌ రాధిక, ఈఎస్‌ఐ ఉద్యోగి నాగరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ హర్షవర్థన్‌, ఎండీ శ్రీహరిని అరెస్ట్‌ చేసి, ఈఎస్‌ఐ సిబ్బందిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే 23 ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారాన్ని సీజ్‌ చేశారు. మరోవైపు దేవికా రాణి ఇంట్లో రెండు సూట్‌కేసులు, రెండు బ్యాగుల డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎమ్‌ఎస్‌) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలయింది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్‌ఎస్‌ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై గురువారం ఏకకాలంలో దాడులు జరిపింది. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించింది.
నమ్మలేని నిజాలు
తెలంగాణలో జరిగిన మెడికల్‌ స్కామ్‌లో తవ్వే కొద్ది నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి వెనుక ఎవరున్నారు..? మాజీ మంత్రి అల్లుడికి, దేవికారిణికి మధ్య డీల్‌ ఏంటి..? వీరితో పాటు స్కామ్‌కి సంబంధమున్న ఆ జర్నలిస్ట్‌ ఎవరు..? మాజీ మంత్రి అల్లుడిని అరెస్టు చేస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మెడికల్‌ స్కామ్‌ మరోసారి కలకలం రేపుతోంది. స్కాములో తెర వెనుక భాగోతం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. ఈ అవినీతి భాగోతంలో కింగ్‌ పిన్‌ దేవిక రాణి వెనుక పెద్ద మనుషుల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దేవికా రాణితో కలిసి బిజినెస్‌ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి అల్లుడు ఈ స్కాములో కీలక పాత్రధారిగా వ్యవహరించినట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒక మాజీ మంత్రి గతంలో నిర్వహించిన కీలక శాఖా అధికారాల ద్వారా దేవికారాణిని దారిలోకి తెచ్చుకుని మందుల కొనుగోళ్లలో, వాటిని ఇతర ప్రైవేట్‌ హాస్పిటళ్ళకు తరలింపులో అత్యంత కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీకి సమాచారం ఉంది. భారీ స్థాయిలో మెడిసిన్స్‌ కొన్నట్టు లెక్కల్లో చూపించి.. వాటిని ఈ.ఎస్‌.ఐ. ఆస్పత్రిలోనే రోగులకు వినియోగించినట్టు రికార్డ్స్‌ స ష్టించినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ.ఎస్‌.ఐ ఆస్పత్రిలో అస్సలు వినియోగించని మందులను కొనుగోలు చేసి, అక్కడే వాడినట్టు రికార్డ్స్‌ స ష్టించి ఆ మెడిసిన్స్‌ని ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించడం ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. దేవికారాణి పరిధిలో పని చేసే దాదాపు 18 నుంచి 20 మందిని ఈ మెడిసిన్స్‌ స్కాం లో భాగస్తులను చేసినట్టు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ అధికారులు రెండ్రోజులుగా ఈఎస్‌ఐకి సంబంధించిన అధికారులు, డైరెక్టర్‌ దేవికారాణి ఇళ్లలో సాదాలు నిర్వహించారు. ఏకకాలంలో 23 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రెండ్రోజులగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు దేవికారాణి ఇంట్లో పలు డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణిని అరెస్ట్‌ చేసి.. బంజారాహిల్స్‌ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్‌ఐ ఉద్యోగులే బినామీలుగా రూ. 200 కోట్ల మెడిసిన్‌ స్కామ్‌కు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ మంత్రి అల్లుడితో కలిసి పలు బినామి కంపెనీలను నడుపుతున్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. అంతేకాదు వీరితో పాటు ఈ స్కామ్‌లో ఓ జర్నలిస్టుకు కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. అవసరం లేకపోయినా రూ. 200 కోట్ల విలువైన మందులను కొన్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్న మందులను సప్లై చేయకుండా.. బిల్లులు స ష్టించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈఎస్‌ఐ మందులతో పాటు, వైద్య పరికరాల కోనుగోళ్లలో కూడా భారీగా అక్రమాలు బయటపడ్డాయి. ఏసీబీ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పద్మలో పాటు 8 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ముషీరాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ ఆఫీసులో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 2015 నుంచి 2018 వరకు ప్రభుత్వానికి రూ.12 వందల కోట్ల నష్టం కలిగించినట్లుగా తేలింది. ఇక మాజీ మంత్రి అల్లుడిని కూడా విచారించేందుకు ఏసీబీ అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
నేపథ్యం ఏంటి?
ఐఎమ్‌ఎస్‌ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్‌ఎస్‌ ఉద్యోగులు, మెడికల్‌ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దిగమింగారని ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్‌ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఏసీబీకి లేఖ రాసారు. ఈ మేరకు ఈ కేసును ఏసీబీ స్వీకరించింది. ముందుగా విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. పలు రికార్డులను, కొనుగోళ్లను పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందజేసారు.
దేవిక రాణి నివాసంలో ఏసీబీ తనిఖీలు
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంగా ఐఎమ్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. ఈ విభాగానికి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఆమ్నీ మెడికల్‌ ఎండీ శ్రీధర్‌, నాగరాజు, తేజ్‌ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డి, వీ6 చానల్‌ రిపోర్టర్‌ నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది.
ఏసీబీ అధికారులు ఏమంటున్నారు
ఐఎమ్‌ఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డా.కె.పద్మ 2018 మే 26, 28వ తేదీల్లో రూ.1.03 కోట్ల నకిలీ బిల్లులను రూపొందించారు. వీటిని పటాన్‌చెరు, బోరబండ ఇన్‌ఛార్జి మెడికల్‌ ఆఫీసర్ల సాయంతో ఈ బిల్లులు క్లెయిమ్‌ చేశారు.అదే నెలలో బొంతపల్లి, బొల్లారం డిస్పెన్సరీలకు రూ.1.22 కోట్ల నకిలీ బిల్లులు తయారు చేసి మందులను మాత్రం పంపకుండా డబ్బులు జేబులో వేసుకున్నారు. ఐఎమ్‌ఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత ఇందిరతో కలిసి ఏకంగా రూ.9.43 కోట్లను బిల్లులపేరిట 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్వాహా చేశారు. మొత్తంగా మందుల కోనుగోళ్ల పేరిట రూ.11.69 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఐఎమ్‌ఎస్‌ సిబ్బందితోపాటు పలువురు ప్క్రెవేటు మెడికల్‌ ఏజెన్సీల ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారు. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ శివ, తేజ ఫార్మా ఏజెంట్‌ సుధాకర్‌రెడ్డి, ఆమ్నీ మెడిసిన్స్‌కు చెందిన శ్రీహరి, వీ-6 చానల్‌ రిపోర్టర్‌ నరేందర్‌రెడ్డి ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే…మరిన్ని అక్రమాలు వస్తాయని ఈఎస్‌ఐ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.