‘ఉదయ్‌’ కి పచ్చజెండా

పచ్చ జెండా ఊపిన రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడీ

విశాఖపట్నం: విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే డబుల్‌ డెక్కర్‌ రైలు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడీ ప్రారంభించారు. విశాఖపట్నంలో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏసీ, డైనింగ్‌ సదుపాయం, టీవీ ఎనౌన్స్‌మెంట్‌ వంటి అత్యాధునిక సదుపాయలు ఉన్న ఈ రైలులో నేడు పరుగులు ఆరంభించింది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభించారు. టికెట్‌ ధర రూ.525లుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
విశాఖ-విజయవాడ మధ్య వారానికి 5 రోజుల పాటు నడిచే అధునాతన ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701/02) స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే సహాయమంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడీ అన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏసీ, డైనింగ్‌ సదుపాయాలు, టీవీ, అనౌన్స్‌మెంట్‌ లాంటి అత్యాధునిక వ్యవస్థలతో తీర్చిదిద్దిన సరికొత్త రైలు లాంఛనంగా పరుగులు ప్రారంభించింది. రైల్వేల అభివ ద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం ద్వారా మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్‌లోనే కొనసాగించేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో నడవనుంది. విశాఖలో తెల్లవారుజామున 5.45 గంటలకు బయలుదేరి వయా దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా ఉదయం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి విశాఖకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలులో 9 డబుల్‌డెక్కర్‌ కోచ్‌లు, రెండు పవర్‌కార్లు ఉంటాయి.
మొదలైన ‘ఉదయ్‌’ టికెట్‌ విక్రయాలు
విశాఖ-విజయవాడ మధ్య తిరిగే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (22701/02)కు ఆన్‌లైన్‌ బుకింగ్‌లతో పాటు కౌంటర్లలోనూ టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి వాల్తేరు అధికారులు బుకింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టారు. విశాఖ-విజయవాడ టికెట్టు ధర రూ.525గా నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖ-తిరుపతి మధ్య తిరుగుతున్న డబుల్‌డెక్కర్‌ ధరల్నే ఈ రైలుకు కూడా అన్వయించారు.